పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ అనునిత్యం ప్రజల సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.ఈనెల 21వ తేదీన పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని పటాన్చెరు, రామచంద్రపురం, అమీన్పూర్, జిన్నారం, గుమ్మడిదల మండలాల పరిధిలోని వంద మంది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఆదివారం సాయంత్రం పటాన్చెరువు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ జర్నలిస్టులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో జర్నలిస్టుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. తెలంగాణ ఏర్పడిన అనంతరం సీఎం కేసీఆర్ జర్నలిస్టుల సంక్షేమానికి పెద్ద పీట వేశారని తెలిపారు. 100 కోట్ల రూపాయలతో జర్నలిస్టుల సంక్షేమ నిధి ఏర్పాటు చేయడంతో పాటు, మృతి చెందిన జర్నలిస్టులకు రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి అక్రిడేషన్ కార్డులు సైతం అందిస్తోందని తెలిపారు.ఈనెల 21వ తేదీన పండుగ వాతావరణం లో పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ కుమార్ గౌడ్, సాయి చరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…