500 మంది విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
ఇటీవల విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులను ప్రోత్సహించడంలో భాగంగా ఈ నెల 20వ తేదీన సైకిల్లు, ప్రశంసా పత్రాలు అందజేయనున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు మంగళవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని ఆయా మండలాల విద్యాశాఖ అధికారులు, ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కరస్పాండెంట్లతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు పరీక్షల సమయంలో మానసిక స్థైర్యం పెంపొందించేందుకు వ్యక్తిత్వ వికాస నిపుణులతో శిక్షణ తరగతులు నిర్వహించడంతోపాటు పరీక్ష సామాగ్రి సైతం అందించడం జరుగుతోందని తెలిపారు. అదే విధంగా ఫలితాల్లో అత్యుత్తమ మార్పులు సాధించిన విద్యార్థులను సైతం ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ప్రతి సంవత్సరం నగదు పురస్కారాలు పంపిణీ చేస్తున్నమని తెలిపారు. ఈ సంవత్సరం వినూత్నంగా సైకిళ్ళు పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని ప్రతి పాఠశాలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ విద్యార్థినీ విద్యార్థులకు పురస్కారాలు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటలకు పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో పటాన్చెరు మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు నాయక్, తదితరులు పాల్గొన్నారు.
