ఇస్నాపూర్ మున్సిపాలిటీ కి ప్రత్యేక నిధులు కేటాయించండి : నీలం మధు ముదిరాజ్

politics Telangana

దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం చూపించండి

మంత్రి వివేక్ కు  వినతి పత్రం ఇచ్చిన ఇస్నాపూర్ మున్సిపల్ కౌన్సిలర్లు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

పటాన్ చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ ని ప్రత్యేకంగా పరిగణించి నిధులు కేటాయించాలి అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.మంగళవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన సమీక్ష సమావేశానికి హాజరైన జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామిని ఇస్నాపూర్ చౌరస్తాలో కలసి ఘనస్వాగతం పలికి నిధులు, పలు సమస్యలపై ఇస్నాపూర్ మున్సిపల్ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు .ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ ఇస్నాపూర్ మున్సిపాలిటీ చిట్కుల్ పరిధిలో గల 329 కాలనీ, ఇస్నాపూర్ ఇందిరమ్మ కాలనీ లో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగిందని ఆ కాలనీలో అంతర్గత రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, కరెంట్ పోల్స్, త్రాగునీరు, ఇంటి నెంబర్లు మరియు కరెంట్ మీటర్లు, వంటి సమస్యలను పరిష్కరించాలని కోరారు, అలాగే నేషనల్ హైవే నుండి లక్డారం- బ్యాతోల్ – రుద్రారం – ఏర్థనూర్ వరకు రోడ్డు, ఇరు వైపులా ఐమాక్స్ లైట్స్ ఏర్పాటు చేయాలని మరియు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించిన 15 కోట్ల నిధుల పనులు ఇప్పటికే ప్రారంభం అయినట్టు మంత్రి కి ఆయన వివరించారు అలాగే మరికొన్ని నిధులు కేటాయించాలని మంత్రిని కోరినట్టు ఆయన తెలిపారు, ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు నారాయణదాసు, మన్నే రాఘవేందర్, వెంకటేష్ నాయక్, అల్లం గారి నర్సింహారెడ్డి, సంగన్న గారి గోపాల్, మంజలి దస్తగిరి, మణికంఠ, నాయకులు వల్లపు వెంకటేష్, మురళి, మహేష్, అనిల్, ప్రవీణ్, కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *