మనవార్తలు ,శేరిలింగంపల్లి :
హైదరాబాద్ మహానగరంలో గల మియాపూర్ లోని బి కే ఎంక్లేవ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో హక్కుల పై అవగాహన సదస్సు నిర్వహించి నూతనసంవత్సరం డైరీ మరియు క్యాలెండర్ లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ప్రపంచ మానవ హక్కుల సంఘం జాతీయ చైర్మన్ ఎం.సుబ్బారెడ్డి. ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హక్కులు గురించి అవగాహన కలిగి ఉండాలని,ఎక్కడ హక్కుల ఉల్లంఘన జరిగినా కూడా ఉపేక్షించేది లేదని,హక్కుల పరంగా ఎటువంటి సమస్య వచ్చినా కూడా ప్రపంచ మానవ హక్కుల సంఘం సభ్యులను ఆశ్రయిస్తే తప్పకుండా వారికి న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు.
ప్రపంచ మానవ హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర చైర్మన్ తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి మాట్లాడుతూ సమస్య ఏదైనా కావచ్చు, ప్రాంతం ఏదైనా కావచ్చు,ప్రజల హక్కుల పరంగా ఎక్కడ అన్యాయం జరిగినా కూడా మా ప్రపంచ మానవ హక్కుల సంఘం ముందు ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరు కూడా వారి ప్రాథమిక హక్కులను తెలుసుకోవాలని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగ చైర్పర్సన్ రేసు స్వప్న మాట్లాడుతూ ఇటీవల కాలంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు చాలా దారుణమని, మహిళల హక్కుల పై పోరాటం సాగించేందుకు ముందుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్ ఏ. జంగారెడ్డి ,తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ కొండా సంతోష్ కుమార్, స్టేట్ సెక్రటరీ రేపాల అవినాష్, స్టేట్ జనరల్ సెక్రెటరీ రంకు గౌర్,ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ దండ సంపత్ రెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా చైర్మన్ నర్సింలు ముదిరాజ్, వరంగల్ జిల్లా చైర్మన్ జనార్ధన్ ,మహిళా విభాగ రంగారెడ్డి జిల్లా చైర్ పర్సన్ చల్ల గీతారెడ్డి గ్రేటర్ వరంగల్ జిల్లా చైర్ పర్సన్ గుంరెడ్డి సునీత, యాదాద్రి భువనగిరి జిల్లా చైర్పర్సన్ రమణ మేడం, సురేష్ ప్రజాపతి, సాయి కుమార్ గౌడ్, యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…