Telangana

పటాన్చెరు ప్రజల అభివృద్ధి నా ప్రధాన ఎజెండా గూడెం మహిపాల్ రెడ్డి

శిఖండి రాజకీయాలు మానుకో

ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత దాడులకు తావులేదు 

రెండుసార్లు ప్రజలు చీకొట్టిన బుద్ధి రాలేదా కాటా 

దమ్ముంటే నేరుగా ఎదుర్కో 

గోడల మీద కాదు.. గుండెల్లో ఉండాలి 

కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట, బలోపేతం చేసేందుకే మా ప్రణాళికలు 

తీరు మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు 

పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాం 

ఘటనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిపై కేసులు నమోదు కావాల్సిందే 

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ప్రజలు రెండుసార్లు చీకొట్టిన  బుద్ధి మారకుండా తిరిగి నియోజకవర్గంలో శిఖండి రాజకీయాలు చేస్తూ వ్యక్తిగత దాడులకు పాల్పడడం మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ కు సూచించారు.గురువారం పటాన్చెరువు పట్టణంలోని క్యాంపు కార్యాలయం పై కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గానికి సంబంధించిన వ్యక్తులు దాడి ఘటనను నిరసిస్తూ ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే జి.ఎం.ఆర్ మాట్లాడారు. ఎమ్మెల్యే నివాసం ఉండే క్యాంపు కార్యాలయం పై కార్యకర్తలను రెచ్చగొట్టి దాడులకు దిగడం ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం లాంటిదన్నారు. పటాన్చెరు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ప్రజల హృదయాలను గెలుచుకోవడం జరిగిందని తెలిపారు. కాటా శ్రీనివాస్ గౌడ్ కి అమీన్పూర్ సర్పంచ్ గా ప్రజలు అవకాశం అందిస్తే నిధులు పక్క దారి పట్టించి జైలు పాలు కావడంతోపాటు.. రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి దారుణ ఓటమికి గురైన వ్యక్తులు నేడు తనపై వ్యాఖ్యలు చేయడం సిగ్గుగా ఉందన్నారు.

తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి నీచ రాజకీయాలను చూడలేదన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రోటోకాల్ ప్రకారం మాత్రమే ఆహ్వానాలు అందజేశారు తప్ప.. పార్టీలకు అనుగుణంగా నిర్వహించడం జరుగుతుందా అని ప్రశ్నించారు.తమ కార్యకర్తలు ప్రతిఘటిస్తే పరిస్థితులు ఎలా ఉండేవని ప్రశ్నించారు. తన కార్యకర్తలు తమ మీద ఒత్తిడి చేసిన నేను వాళ్ళను కంట్రోల్ చేసుకుంటూ అక్కడికి ఎవరిని రాకుండా ఎలాంటి హింస వాతావరణం చోటు చేసుకోకుండా నియంత్రించానని వెల్లడించారు. ఇలాంటి దాడుల సంస్కృతి పటాన్ చెరు ప్రాంతంలో ఇప్పటివరకు లేదని తమ ఓపికను పరీక్షిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృత్తం చేస్తే చూస్తూ ఊరుకోబోమని అందుకు తగ్గ మూల్యం చెల్లిస్తామని తీవ్రంగా రియాక్టయ్యారు. క్యాంపు ఆఫీసు పై దాడి చేసిన దుండగులపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని వారి పై కేసు లు నమోదు చేసి జైలుకు పంపాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఈ ఘటన పై ఇప్పటికే ఐ జి సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేశామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సైతం ఫిర్యాదు చేయడం జరుగుతుందని తెలిపారుఈ సమావేశంలో ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..

admin

Recent Posts

గీతంలో క్వాంటం సాంకేతికపై పరిశోధన

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: క్వాంటం టెక్నాలజీల కోసం షట్కోణ బోరాన్ నైట్రైడ్ లో రుణాత్మక ఆవేశం గల ఏక…

1 day ago

నిజాయితీ, నిబద్ధత కలిగిన నిస్వార్థ నాయకుడు స్వర్గీయ జి. ఎల్లన్న: మాజీ మంత్రి హరీశ్ రావు

తెల్లాపూర్ ‘జి. ఎల్లయ్య ఎన్‌క్లేవ్’లో ఎల్లన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన హరీశ్ రావు పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ…

1 day ago

రఘునాథ్ యాదవ్ కు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నేతలు

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మారబోయిన రఘునాథ్ యాదవ్ ను తెలంగాణ…

2 days ago

గీతంలో ముగిసిన భౌతికశాస్త్ర ఉపాధ్యాయుల శిక్షణ

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ‘అధునాతన భావనలు, బోధనా పద్ధతులు, విద్యా సాధనాలు’ అనే అంశంపై భౌతికశాస్త్ర ఉపాధ్యాయుల కోసం…

2 days ago

కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయం నుండి డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టండి

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి ని కోరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:…

3 days ago

డిఆర్డిఏ, మెప్మ, రెవెన్యూ, ఎక్సైజ్, హెచ్ఎండిఎ శాఖల అధికారులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష

మహిళా సంఘాల ఆర్థిక అభ్యున్నతికి పెద్దపీట మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్, రైస్ మిల్ ఏర్పాటుకు త్వరలో భూమి…

3 days ago