మనవార్తలు ,అమీన్పూర్
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ రాష్ట్రాన్ని దేశానికి దిక్సూచిగా మారుస్తున్నారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శనివారం మధ్యాహ్నం అమిన్ పూర్ మండల పరిషత్ అధ్యక్షులు దేవానంద్ అధ్యక్షతన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే జీఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని పనిచేసి ఇటు ప్రభుత్వానికి అటు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
అభివృద్ధి కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం వహించారని అధికారులకు సూచించారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన లబ్ధిదారులను అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, ఎంపీడీవో మల్లేశ్వర్, సర్పంచులు ఎంపీటీసీలు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
విజయ గర్జనను విజయవంతం చేయండి
అమీన్పూర్
నవంబర్ 15వ తేదీన వరంగల్ లో జరగనున్న టిఆర్ఎస్ పార్టీ విజయ గర్జన సభను విజయవంతం చేయడంలో ప్రతి కార్యకర్త భాగస్వామ్యం కావాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బాలాజీ కన్వెన్షన్ సెంటర్ లో అమీన్పూర్ మండలం, మున్సిపల్ టిఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. టిఆర్ఎస్ పార్టీ 20 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా
ఈనెల 25వ తేదీన నిర్వహించనున్న ప్లీనరీ, విజయ గర్జన ఏర్పాట్లపై ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య నాయకులకు కార్యకర్తలకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నరసింహ గౌడ్,. ఎంపీపీ దేవానందం, జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఈర్ల రాజు, మున్సిపల్ అధ్యక్షులు బాల్ రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.
అమీన్పూర్ లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
అమీన్పూర్ మున్సిపల్, మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 33 మంది లబ్ధిదారులకు మంజూరైన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పంపిణీ చేశారు. శనివారం సాయంత్రం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బాలాజీ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, అమీన్పూర్ జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, ఎంపీపీ దేవానందం, ఎమ్మార్వో విజయ్ కుమార్, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు కౌన్సిలర్లు పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…