Telangana

హోప్ అఫ్ హంగర్ వారి టైలరింగ్ శిక్షణ ధ్రువపత్రాలు అందించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :

హోప్ అఫ్ హంగర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలనే ఆశయంతో ప్రొజెక్ట్ నారీ తేజం పేరుతో మొదటి దశలో భాగంగా 124 అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఇరవై మంది నిరుపేద మహిళలకు మూడు నెలల పాటు కుట్టు మిషన్ (స్ట్రిచింగ్) నైపుణ్య శిక్షణ కోర్సును నేర్పించారు. కోర్సు పూర్తిచేసుకున్న మహిళలకు డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ చేతులమీదుగా టైలరింగ్ శిక్షణ ధ్రువీకరణ పత్రాలను అందించారు . అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ శిక్షణ కోర్సును విజయవంతంగా పూర్తిచేసుకున్న మహిళలందరు స్వయం ఉపాధి పొంది ఆర్థికంగా ఎదగాలని కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియచేసారు. డివిజన్ లోని పేద ప్రజలకు సేవ చేస్తున్న హోప్ ఆఫ్ హంగర్ సంస్థ వ్యవస్థాపకురాలు ఆలేఖ్యకు కృతజ్ఞతలు తెలియచేసారు. మా డివిజన్ లో పేద మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయని అటువంటి వారికి అండగా నిలుస్తూ ప్రాజెక్ట్ నారీ తేజం లో భాగంగా నిరుపేద మహిళలకు కుట్టు మిషన్ ట్రైనింగ్ ఇచ్చి వారికి స్వయం ఉపాధి కల్పిస్తున్న హోప్ ఆఫ్ హాంగర్ బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో అలేఖ్య, వెంకటేశ్వరరావు, రవి కిరణ్, మీరయ్య, ఇందిరరాణి, హైమావతి తదితరులు పాల్గొన్నారు.

 

admin

Recent Posts

వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలనే జీవో 34ను అమలు చేయాలి

ఈనెల10న జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా ఎన్ పిఆర్ డి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు పి మేరీ,…

15 hours ago

సౌత్ ఇండియన్ బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ రీజినల్ మీటింగ్

సికింద్రాబాద్ ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ సౌత్ ఇండియన్ బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ యూనియన్ మీటింగ్ సికింద్రాబాద్ పరిధిలోని డైమండ్…

16 hours ago

హనుమాన్ దేవాలయం అభివృద్ధికి సంపూర్ణ సహకారం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని నర్ర బస్తిలో గల హనుమాన్ దేవాలయం అభివృద్ధికి సంపూర్ణ సహకారం…

21 hours ago

వీరశైవ లింగాయత్ సమాజం కార్తీక మాసం వనభోజనాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

అమీన్పూర్ ,మనవార్తలు ప్రతినిధి : సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ గుట్ట పైన వీరశైవ…

21 hours ago

సాంకేతికతపై అవగాహనా కార్యశాల

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం హైదరాబాదులోని గిట్ హబ్ (విద్యార్థుల నేతృత్వంలోని టెక్ కమ్యూనిటీ) క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం…

3 days ago

గీతంలో ఉత్సహభరితంగా హలోవీన్ వేడుక

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదు మరో వినూత్న కార్యక్రమానికి వేదికైంది. గీతం క్యాంపస్ లైఫ్…

3 days ago