నాణ్యమైన సేవలకు చిరునామా పటాన్‌చెరు పెద్దాసుపత్రి
సేవల్లో దేశంలోనే ఏడవ స్థానంలో నిలవడం ప్రశంసనీయం
పటాన్‌చెరు శాస నసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ఆసియాలోని అతిపెద్ద పారిశ్రామిక వాడగా పేరేందిన పటాన్చెరు పట్టణంలో గల టంగుటూరి అంజయ్య ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నాణ్యమైన సేవలకు చిరునామాగా నిలుస్తోందని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆసుపత్రిని ఆధునిక సౌకర్యాలతో ఆధునికరించడంతోపాటు, రోగులకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నామని తెలిపారు. శుక్రవారం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆసుపత్రి లోని అన్ని విభాగాలను పరిశీలించారు. ఆస్పత్రి ప్రాంగణం తో పాటు చుట్టుపక్కల శానిటేషన్ సరిగా చేయడం లేదని సంబంధిత కాంట్రాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్, ఆర్ఎంవో, వైద్యులు, సలహా సంఘం కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ. ఇటీవల కేంద్ర ఆరోగ్య శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో పటాన్చెరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి నాణ్యమైన సేవల విభాగంలో జాతీయస్థాయిలో ఏడవ స్థానం లభించడం పట్ల ఆసుపత్రి వైద్యులను సిబ్బందిని అభినందించారు. త్వరలోనే అవార్డు రావడంలో భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరిని సన్మానించబోతున్నట్లు తెలిపారు.ప్రతి సంవత్సరం 1500 కు పైగా ప్రసూతి ఆపరేషన్లు నిర్వహించడంతోపాటు, 2 లక్షలకు పైగా రోగులకు ఔట్ పేషెంట్ విభాగంలో సేవలు అందించడం గర్వనీయమన్నారు. అన్ని విభాగాల్లో 24 గంటల పాటు వైద్య సేవలు అందించడంతోపాటు, అన్ని రకాల ల్యాబ్ టెస్టులు ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ఈ సందర్భంగా ఆసుపత్రిలో నెలకొన్న పలు సమస్యలను సూపరిండెంట్ శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే జిఎంఆర్ దృష్టికి తీసుకెళ్లారు.ప్రధానంగా ఆక్సిజన్ ప్లాంట్, జనరేటర్,. మురుగునీటి సమస్య, పెయింటింగ్, నీటి సంపు మోటార్లు, లిఫ్ట్ ఏర్పాటు చేయాలని కోరారు. ఎందుకు స్పందించిన ఎమ్మెల్యే జిఎంఆర్.. ప్రభుత్వం అందించే నిధులతోపాటు స్థానిక పరిశ్రమల సహకారంతో పైన పేర్కొన్న సమస్యలన్నింటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.వీటితోపాటు అతి త్వరలో మరో అంబులెన్స్ కొనుగోలుకు నిధులు కేటాయిస్తానని తెలిపారు.పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ప్రజలు ఎక్కువగా ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తారని, వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ సేవల్లో లోపం ఉండకూడదని ఆదేశించారు. సౌకర్యాలు లేవంటూ రోగులను వేరే ఆసుపత్రులకు రిఫర్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. త్వరలోనే డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు తెలిపారు.ఈ సమావేశంలో డిసిహెచ్ఎస్ అధికారి సంగారెడ్డి, ఆస్పత్రి సూపరిండెంట్ శ్రీనివాసరెడ్డి, ఆర్ఎంవో ప్రవీణ, కమిటీ సభ్యులు గాయత్రి పాండు, కంకర సీనయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, ఆస్పత్రి వైద్యులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…