శివనగర్ లో 15 లక్షల సొంత నిధులతో నిర్మించిన
ముదిరాజ్ సంఘం నూతన భవనం ప్రారంభోత్సవం
కాంగ్రెస్ పార్టీకి,రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన నీలం
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
బహుజనుల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.సోమవారం పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండలం శివనగర్ గ్రామంలో నీలం మధు తన సొంత నిధులు 15 లక్షలు వెచ్చించి నిర్మించిన ముదిరాజ్ సంఘం నూతన భవనాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా నీలం మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం బహుజనులకు అందులో ముఖ్యంగా ముదిరాజ్ లకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చి గౌరవిస్తున్నారని తెలిపారు. గతంలో ప్రభుత్వాలు ముదిరాజ్ లను కేవలం ఓటు బ్యాంకు గా చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముదిరాజ్ లను పాలనలో భాగస్వాములను చేశారని తెలిపారు. అందుకు ముదిరాజ్ బిడ్డ వాకిటి శ్రీహరి ముదిరాజ్ ను మంత్రి వర్గంలోకి తీసుకోవడం ఉదాహరణ అని కొనియాడారు.
కాంగ్రెస్ చేపట్టిన బీసీ కులగణన ను బీసీలందరూ వినియోగించుకోవాలని కోరారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బహుజనులు రాజకీయంగా బలపడాలని సూచించారు. మనలో రాజకీయ చైతన్యం వస్తేనే మన బిడ్డలు రాజకీయంగా బలపడితేనే మన జాతులకు గుర్తింపు వస్తుందని స్పష్టం చేశారు. ముదిరాజ్ ల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడానికి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొని వెళ్లానని త్వరలో ఆ సమస్యలు పరిష్కారం చేసుకుందామన్నారు.
ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు వీర్నల సత్యనారాయణ,ఆత్మ కమిటి చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ కుంచల ప్రభాకర్,మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు వడ్డే కృష్ణ,మాజీ ఎంపీటీసీ మహేష్,నీరుడి కృష్ణ, నర్సింలు,అశోక్,అన్వర్ పటేల్,మహేష్, శ్రీనివాస్, జాకీ, మల్లేష్, నర్సింలు, కాంగ్రెస్ శ్రేణులు,సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
తోషిబా యాజమాన్యాన్ని కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: పటాన్‌చెరుప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, హాస్టల్ భవనాల నిర్మాణాలకు…
పదో తరగతి విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస నిపుణులచే ప్రత్యేక తరగతులు ప్రారంభం 8 వేల మంది విద్యార్థులకు సొంత నిధులచే…
ప్రతిభ, అనుభవపూర్వక అభ్యాసంతో అబ్బురపరచనున్న వార్షిక వేడుక మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్షిక ఉత్సవం…
అమీన్‌పూర్‌లో ప్రభుత్వ భూముల కబ్జా తహసీల్దార్‌కు వినతి పత్రం అందించిన మాజీ వైస్ ఎంపీపీ, మాజీ వార్డు సభ్యు లు…
విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…