Hyderabad

కామ్రేడ్ తాండ్ర కుమార్ గారి 51 అడుగుల భారీ స్మారక స్థూపానికి శంకుస్థాపన

మనవార్తలు, శేరిలింగంపల్లి :

పొలిట్బ్యూరో సభ్యులు,రాష్ట్ర కార్యదర్శి అమరజీవి కామ్రేడ్ తాండ్ర కుమార్ స్మారకార్ధం గా ఎంసీపీఐ యూ ఎయిర్టెల్ హైదరాబాద్ కమిటీ మియాపూర్ లో నిర్మించ తలపెట్టిన 51 అడుగుల భారీ స్మారక స్థూపాన్ని పొలిట్బ్యూరో సభ్యులు కామ్రేడ్ వల్లేపు ఉపేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం కామ్రేడ్ వల్లెపు ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ కామ్రేడ్ తాండ్ర కుమార్ ప్రజల కోసం పోరాడిన చరిత్ర కలిగిన ప్రజల మనిషి అని అన్నారు. ఆయన చరిత్రను నిలబెట్టడం పార్టీ బాధ్యతగా చారిత్రకమైన జ్ఞాపకార్థం గా ఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో భారీ స్థూప నిర్మాణం చేస్తున్నామని అన్నారు. అయినా 35 సంవత్సరాల కమ్యూనిస్టు రాజకీయ ప్రస్థానంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నా రని,పోరాటాల, నిర్బంధాల,త్యాగాల గురించి చెప్పుకోవాలంటే తాండ్ర కుమార్ గుర్తిండిపోయే నాయకుడు అని అన్నారు.

పొట్ట చేత పట్టుకొని గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతానికి వచ్చిన ప్రజలను సమీకరించి ప్రభుత్వ భూములను పంచి అనేక బస్తిలను ఏర్పాటు చేసిన చరిత్ర కలిగిన మనిషి అని ఆయన కొనియాడారు. ఎం సి పి ఐ యు సైద్ధాంతిక,రాజకీయ, నిర్మాణ విధానాన్ని అమలు పరచడంలో, పార్టీని నిలబెట్టడం లో ఆయన ముందు బాగం లో ఉన్నా నాయకుడు అని అన్నారు. ఈ స్థూపం నిర్మాణం రేపటి తరాలకు చారిత్రాత్మకంగా ఉంటుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ గాదగోని రవి మాట్లాడుతూ కామ్రేడ్ తాండ్ర కుమార్ సిద్ధాంతం నుంచే కాకుండా మనుషుల అనుభవాల గుణపాఠాలను నిర్మాణాత్మకమైన నాయకుదిగా ఎదిగిన వారని అన్నారు. ఆయన జీవితం తెరిచిన పుస్తకం లాంటిదని, భావితరాలకు ఆయన పోరాట, త్యాగాల జీవిత అంశాలు గుర్తుండిపోయే చరిత్రను ఈ భారీ స్తూపం చూపిస్తుందని తెలియజేశారు.

కమ్యూనిస్టు ఉద్యమంలో అసువులు బాసిన ఎంతోమంది త్యాగధనులను స్మరించుకోవడానికి ఇలాంటి స్తూపాలే ప్రజలకు దర్శనమిస్తుంటాయి అని,వాటి ద్వారా అవినీతి,రహిత,కుల-మత అసమానతలకు వ్యతిరేకంగా జరిగే పోరాటాలకు, సమసమాజ స్థాపన కోసం జరిగే ప్రజా చైతన్య కార్యక్రమాలకు ఒక చైతన్యపు రీతమైన ఉత్తేజాన్ని ఇస్తున్నాయని అలాంటి ఉత్తేజాన్ని ఇవ్వడంలో తాండ్ర కుమార్ జీవితం ఆదర్శవంతమైనది కాబట్టి రేపటి తరాలకు ఒక పోరాట దిక్సూచిగా తాండ్రకుమార్ కి 51 అడుగులతో పార్టీ నిర్వహించనున్న భారీ స్తూపం తో స్మరించుకుంటూ ఉన్నామని, ఈ స్థూప నిర్మానానికి పార్టీ శ్రేణులు, కుటుంబ సభ్యులు ఆదర్శ వంతంగా ముందున్నారని, ఈ స్మారక స్థూపం నిర్మాణానికి అన్ని వర్గాల ప్రజలు తమ సహాయసహకారాలు తోడ్పాటును అందించి తమ భాగస్వామ్యాన్ని పంచుకో ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి వి. తుకారం నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కామ్రేడ్ తాండ్రకుమార్ భార్య తాండ్ర కళావతి, కుమారుడు తాండ్ర రమేష్ లతోపాటు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కుంభం సుకన్య,వనం సుధాకర్,రాష్ట్ర కమిటీ సభ్యులు మైదం శెట్టి రమేష్,టి అనిల్ కుమార్, ఏ పుష్ప,పల్లె మురళి, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి భద్రభోని పురుషోత్తం,గ్రేటర్ హైదరాబాద్ కమిటీ సభ్యులు పి భాగ్యమ్మ,డి మధుసూదన్, మియాపూర్ డివిజన్ కార్యదర్శి కన్న శ్రీనివాస్, డివిజన్ కమిటీ సభ్యులు యన్.గణేష్,శంకర్, రతన్ నాయక్, కే రాజు, రంగస్వామి, ఎం రాణి, దరా లక్ష్మి, లావణ్య,విమల,సుల్తానా బేగం,శివాని, ఇంద్ర, అమీనా మరియు దశరథ్ నాయక్,రవి, నాగభూషణం,ఆకుల రమేష్ అలాగే కుటుంబ సభ్యులు తాండ్ర సత్యనారాయణ,తాండ్ర కృష్ణ,తాండ్ర వెంకటేష్, శ్రీనివాస్, హనుమంతు, తాండ్ర వేణు, ఎల్లంకి శ్రీను, ప్రవీణ్ గౌడ్, రోహన్ తదితరులు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

2 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

2 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

2 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

1 week ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

1 week ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

1 week ago