_గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత
_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
మనవార్తలు ,అమీన్పూర్
అమీన్పూర్ మండల పరిధిలోని ఎనిమిది గ్రామ పంచాయతీలలో ఆరు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నట్టు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని దాయర, గండి గూడెం, వడక్ పల్లీ గ్రామాల్లో కోటి 50 లక్షల రూపాయల TSIIC నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులకు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి నిధులతో పాటు జిల్లా పరిషత్, ముఖ్యమంత్రి ప్రకటించిన ప్రతి గ్రామ పంచాయతీకి 20 లక్షల రూపాయలతో అన్ని గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు. సుల్తాన్పూర్ లో ఏర్పాటైన మెడికల్ డివైస్ పార్క్ లో నూతన పరిశ్రమల ఏర్పాటు శరవేగంగా సాగుతోందని, స్థానికులకే ఉద్యోగ అవకాశాలు లభించేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేవానందం, జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, ఎంపిడిఓ మల్లేశ్వర్, సర్పంచులు భాస్కర్ గౌడ్, పాండు, లలితా మల్లేష్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాజు, సీనియర్ నాయకులు రాజు, శ్రీకాంత్ రెడ్డి, తదితరులు
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఐదు సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించు కోవాలని…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : దేశ వ్యాప్త పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం పటాన్‌చెరు పట్టణంలోని జిహెచ్ఎంసి కార్యాలయం…
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…