మనవార్తలు , పటాన్చెరు
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన పనులను గడువులోగా పూర్తి చేయాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రజా ప్రతినిధులకు సూచించారు. ఈ పథకం ద్వారా ప్రతి గ్రామంలో సిసి రోడ్లు నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. గురువారం పటాన్చెరు మండల పరిషత్ కార్యాలయంలో ఎన్ఆర్ఈజీఎస్ పనుల పురోగతి పై అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రజాప్రతినిధులకు పలు సూచనలు చేశారు.
ప్రభుత్వం నుండి విడుదలయ్యే నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నప్పుడే గ్రామంలో ప్రజాప్రతినిధులకు సమాజంలో తగిన విలువ ఉంటుందని అన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ పథకం ద్వారా పటాన్చెరు నియోజకవర్గానికి ఐదు కోట్ల 60 లక్షల రూపాయలు మంజూరు కాగా, పటాన్చెరు మండలానికి 2 కోట్ల 40 లక్షల రూపాయలు కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు. వీటి ద్వారా మండల పరిధిలోని 19 గ్రామాలలో సిసి రోడ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 10వ తేదీ లోపు అన్ని నిర్మాణాలు పూర్తి చేసి వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.
పంచాయతీరాజ్ శాఖ ద్వారా నియోజకవర్గంలోని గ్రామాలలో రహదారులు నిర్మించేందుకు 23 కోట్ల రూపాయల ప్రతిపాదనలు పంపామని, త్వరలోనే ఇందుకు సంబంధించిన నిధులు మంజూరు కానున్నాయని తెలిపారు. జిహెచ్ఎంసి, మున్సిపాలిటీలకు సైతం 50 కోట్ల రూపాయల చొప్పున నిధులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ప్రతి గ్రామంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఎంపీపీ సుష్మ శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, ఎంపీడీవో బన్సీలాల్, ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఇక చదవండి
అమీన్పూర్ మున్సిపల్ అభివృద్ధికి సంపూర్ణ సహకారం_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…
పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ చాటిన బీ.ఆర్క్. విద్యార్థిని ఆశ్రిత రాజు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం డీమ్డ్…
54 మంది లబ్ధిదారులకు 24 లక్షల 43 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,…
వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో…