Telangana

వెంకట్ రెడ్డి కాలనీలో ఓపెన్ డ్రైనేజీ పనులపై జోనల్ కమిషనర్ కార్యాలయం లో ఫిర్యాదు

మనవార్తలు ప్రతినిధి – శేరిలింగంపల్లి :

వెంకట్ రెడ్డి కాలనీ లో అసంపూర్తిగా ఉన్న ఓపెన్ డ్రైనేజీ సమస్య పరిశరించాలని కోరుతూ స్థానిక ప్రజలతో కలిసి బీఆర్ఎస్ నాయకుడు పొట్ట నరేందర్ యాదవ్ సోమవారం రోజు జోనల్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు సమర్పించారు. కాలనీలో అసంపూర్తిగా వదిలిపెట్టిన ఓపెన్ డ్రైనేజీ కారణంగా తీవ్ర దుర్వాసన వ్యాపిస్తూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఆ ప్రాంతం నివసించడానికి అనర్హంగా మారిందని స్థానిక ప్రజలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినప్పటికీ, ఇప్పటివరకు పనులు పూర్తి కాకపోవడంతో ప్రజలు నిత్యం అనారోగ్యకర పరిస్థితులనుఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మురుగు నీటి దుర్వాసనతో చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. స్థానిక ప్రజల తరఫున వెంటనే పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.ఫిర్యాదుపై స్పందించిన జోనల్ కమిషనర్ కార్యాలయ అధికారులు 10 రోజుల్లో సమస్యకు పరిష్కారం కనుగొని తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు అశోక్, శ్రీధర్, ప్రభాకర్, జ్ఞానేశ్వర్, ఆకాశ్, దశరథ్, కిరణ్, ముక్తేదార్, సలీమ్, మన్సూర్ తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

10 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

10 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

10 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

10 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

10 hours ago