Telangana

మియాపూర్‌లో ఘనంగా ఇపిఎల్ సీజన్ – 3 ప్రారంభం

ముఖ్య అతిథులుగా జగదీశ్వర్ గౌడ్,యలమంచి ఉదయ్ కిరణ్

యువ క్రికెటర్లలో ఉత్సాహాన్ని నింపిన ఇపిఎల్ తరహా ప్లేయర్స్ ఆక్షన్

మనవార్తలు ప్రతినిధి – శేరిలింగంపల్లి :

యువత సరైన దిశలో సాగేందుకు క్రీడలే బలమైన మార్గం అని శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ , టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీ వి. జగదీశ్వర్ గౌడ్ అన్నారు .మియాపూర్‌లోని నీలిమా గ్రీన్స్ వేదికగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ క్రికెట్ అకాడమీ (సీఓఈసి) మరియు యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఇపిఎల్ సీజన్ – 3 ని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీ వి. జగదీశ్వర్ గౌడ్ లాంఛనంగా ప్రారంభించారు.యువతలో క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ, జట్టు భావన, నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ ఇపిఎల్ టోర్నమెంట్ ఇప్పటికే స్థానిక యువ క్రికెటర్లకు ప్రతిష్టాత్మక వేదికగా నిలిచింది.ఈ సీజన్‌లో ప్రత్యేక ఆకర్షణగా ఐపిఎల్ తరహాలో నిర్వహించిన ప్లేయర్స్ ఆక్షన్ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. ఆటగాళ్ల ప్రతిభ ఆధారంగా A+, A, B విభాగాలుగా వర్గీకరించి నాలుగు జట్లలో ఎంపిక చేయడం ద్వారా ప్రొఫెషనల్ లీగ్ వాతావరణాన్ని సృష్టించారు. ఈ వినూత్న విధానం యువ ఆటగాళ్లలో అపార ఉత్సాహం, పోటీతత్వాన్ని పెంపొందించింది.అనంతరం శ్రీ వి. జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ క్రీడలు యువతలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు మరియు పోరాటస్ఫూర్తిని పెంపొందిస్తాయి. యువ క్రికెటర్లకు ఇలాంటి అద్భుతమైన వేదికను అందిస్తున్న సీఓఈసి అకాడమీ నిర్వాహకులు అభినందనీయులు. సమాజ సేవతో పాటు క్రీడలను ప్రోత్సహిస్తున్న శ్రీ యలమంచి ఉదయ్ కిరణ్ సేవలు యువతకు స్ఫూర్తిదాయకం” అని పేర్కొన్నారు.అలాగే అకాడమీ వ్యవస్థాపకులు మనస్ ముట్టవరపు , కోచ్‌లు దివాకర్ మరియు విష్ణు యువ క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు చేస్తున్న కృషిని ముఖ్య అతిథులు ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో రావిపాటి కోటేశ్వరరావు, రావిపాటి వెంకటేశ్వరరావు, అశోక్, అమర్‌నాథ్, రామ్‌చందర్ గౌడ్, రవి, శ్రీకాంత్, వాసు, దినేష్, గిరి, గురువులు, రాకేష్, శరత్, రాధాకృష్ణ, వంశీ, ప్రవీణ్, నాగసాయి, రత్నాచారి, సాయి నిఖిల్, రాజేష్, వినోద్, వినయ్, శివ తదితరులు పాల్గొన్నారు.

 

 

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago