Telangana

పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలు ఎంతో మేలు చేస్తాయి – మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ

మనవార్తలు ,పటాన్ చెరు:

ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు మ‌ట్టి విగ్ర‌హాలు ఎంతో మేలు చేస్తాయ‌ని ప‌టాన్ చెరు మాజీ ఎమ్మెల్యే స‌త్య‌నారాయ‌ణ అన్నారు .సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరు ప‌ట్ట‌ణంలోని డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ విగ్ర‌హం వ‌ద్ద ప్ర‌జ‌ల‌కు ఉచితంగా మ‌ట్టి వినాయ‌క ప్ర‌తిమ‌ల‌ను పంపిణీ చేశారు . మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కాలుష్యానికి కారణమయ్యే, ప్రజలకు ఇబ్బందులు కలిగించే ప్లాస్టిక్‌, రసాయన వినియోగాన్ని తగ్గంచాల్సిన అవ‌సం ఉంద‌న్నారు . ముఖ్యంగా ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో తయారు చేసే విగ్రహాల వల్ల ఏర్పడిన కాలుష్యంతో పర్యావరణానికి ముప్పు వాటిల్ల్లుతోందని … ఇలాంటి పరిస్థితుల్లో మట్టి గణపతులను పూజించడం ద్వారా భవిష్యత్‌ తరాలకు ఆరోగ్యకరమైన సమాజాన్ని అందించినట్లవుతుందని మాజీ ఎమ్మెల్యే స‌త్య‌నారాయ‌ణ అన్నారు .

మ‌రోవైపు మియాపూర్ నుండి పటాన్ చెరు మీదుగా సంగారెడ్డి వరకు మెట్రోరైల్ విస్తరించాలనే డిమాండ్ తో ఏర్పాటు చేయబడ్డ సాధన సమితి ఆధ్వ‌ర్యంలో ప‌లు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు . పర్యావరణ పరిరక్షకోసం ప్రజలను చైతన్యం చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు ఆయన తెలిపారు. వినాయకుని ఆశీస్సులతో మెట్రో సాధన కోసం ప్రతీ ఒక్కరం కృషి చేయాల‌ని విగ్రహాల సంఖ్య పెరిగినట్టుగానే ప్రజల్లో ఐక్యమత్యం పెరగాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు . ఈ కార్యక్రమంలో రుద్రారం శంకర్ అన్వర్ పటేల్, పాపరాజు, మహెష్ తదితరులు పాల్గొన్నారు .

admin

Recent Posts

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర మరింత పెరగాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…

10 hours ago

మీ ఆలోచనే మీకు పెట్టుబడి

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…

13 hours ago

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

2 days ago

సీఎం కప్ లో గీతం విద్యార్థికి మూడు బంగారు పతకాలు

పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ చాటిన బీ.ఆర్క్. విద్యార్థిని ఆశ్రిత రాజు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం డీమ్డ్…

2 days ago

ప్రజా సంక్షేమమే మా లక్ష్యం పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

54 మంది లబ్ధిదారులకు 24 లక్షల 43 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,…

2 days ago

జిన్నారం శ్రీ జీవనజ్యోతి జ్యోతిర్లింగం క్షేత్రం అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో…

3 days ago