పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ప్రతిష్ఠాత్మక ‘సీఐఐ మెగా ప్లాంటేషన్ అవార్డు’తో గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ ను సత్కరించింది. సీఐఐ తెలంగాణ రాష్ట్ర వార్షిక సమావేశం- 2023-24, సుస్థిర తెలంగాణ నిర్మాణంపై సదస్సు సందర్భంగా ఈ ఆవార్డును ప్రదానం చేయగా, గీతం రెసిడెంట్డీ డైరక్టర్ వీవీఎస్ఆర్ వర్మ ఈ అవార్డును అందుకున్నట్టు గురువారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.గీతం ప్రాంగణంలో గత ఏడాది సుమారుగా ఎనిమిది వేల మొక్కలను నాటి మెగా ప్లాంటేషన్ డ్రైవ్ లో చురుగ్గా పాల్గొన్నందుకు ఈ గుర్తింపు లభించినట్టు తెలిపారు. ఈ అవార్డును గత ఏడు సంవత్సరాలుగా గీతం అందుకుంటూ, పర్యావరణ సుస్థిరత పట్ల తన నిబద్ధతను చాటి చెబుతోందన్నారు.పర్యావరణ పరిరక్షణకు సహకరించడంలో విద్యార్థులు, సిబ్బంది అంకితభావంతో చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు లభించిందని డీవీవీఎస్ఆర్ వర్మ హర్షం వెలిబుచ్చినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…