Telangana

నిరుపేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిది ఎమ్మెల్యే జిఎంఆర్

30 లక్షల రూపాయల విలువైన సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు :

పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య చికిత్స అందించడంలో ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోందని పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.పటాన్ చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో  నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలు, మున్సిపాలిటీలు, డివిజన్లకు సంబంధించిన 75 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ద్వారా మంజూరైన 30 లక్షల 67 వేల రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే జిఎంఆర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన వైద్య సహాయం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తుందని ఆయన అన్నారు. నియోజకవర్గంలో అర్హులైన లబ్ధిదారులకు పూర్తి పారదర్శకతతో ప్రభుత్వ పథకాలు అందజేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పీటీసీ బాల్ రెడ్డి, గడ్డపోతారం మున్సిపల్ వైస్ చైర్మన్ మహేందర్ గౌడ్, పృథ్వీరాజ్, శంకర్ రెడ్డి, శివరాజ్, రాజు, శంకర్, ప్రమోద్ గౌడ్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

admin

Recent Posts

నేడు పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో బేతాళ స్వామి జాతరలో. అంబలి, అన్నదానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తాము చదువుతున్న ఊరికి, జాతరకు వచ్చే భక్తులకు ఎండ వేడిమిని నుండి ఉపశమనం…

16 hours ago

అధునాతన ఔషధ పరిశోధనలో సమగ్ర శిక్షణ

గీతంలో ప్రారంభమైన నాలుగు రోజుల ఫార్మాఎక్స్ ప్లోర్-2026 మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్…

16 hours ago

సర్వమతాల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యం.. ఎమ్మెల్యే జిఎంఆర్

36 లక్షల రూపాయలతో గుమ్మటాలకు ప్రహారీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన.. మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు :…

2 days ago

అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్: మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారతదేశ సామాజిక, రాజకీయ చరిత్రలో అణగారిన వర్గాల గొంతుకను వినిపించిన మహోన్నత…

2 days ago

డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకం

పటాన్ చెరులో ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారత మాజీ…

2 days ago

​బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగజీవన్ రామ్_యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారత మాజీ ఉప ప్రధాని, స్వాతంత్ర్య సమరయోధుడు బాబు జగజీవన్ రామ్…

2 days ago