Telangana

అధునాతన ఔషధ పరిశోధనలో సమగ్ర శిక్షణ

గీతంలో ప్రారంభమైన నాలుగు రోజుల ఫార్మాఎక్స్ ప్లోర్-2026

మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు :

హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ఈనెల 6 నుంచి 9వ తేదీ వరకు బి.ఫార్మ్ చివరి ఏడాది విద్యార్థుల కోసం ‘ఫార్మాఎక్స్ ప్లోర్-2026: అధునాతన ఔషధ పరిశోధన అంతరంగం’ అనే నాలుగు రోజుల ప్రయోగశాల సమగ్ర శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.అత్యాధునిక పరిశోధనా సదుపాయాలు, వర్ధమాన ఔషధ అభివృద్ధి సాంకేతికతలను ఔత్సాహిక ఫార్మసిస్టులు ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం ఒక విశిష్ట వేదికను కల్పించింది. ఇందులో పాల్గొంటున్నవారు అధ్యాపకులు, పరిశోధకులతో చురుకుగా సంభాషిస్తూ, ఫార్మాస్యూటికల్ సైన్సెస్ లో విస్తృతంగా ఉపయోగించే ఆధునిక పరికరాలు, వినూత్న పరిశోధన సాధనాలతో ప్రత్యక్ష అనుభవాన్ని పొందుతున్నారు.

సమగ్ర అభ్యాస అనుభవంలో భాగంగా, విద్యార్థులను మార్గదర్శక ప్రయోగశాల పర్యటలకు తీసుకెళ్లి, అత్యాధునిక విశ్లేషణాత్మక పరికరాలను ప్రత్యక్షంగా చూసేందుకు వీలు కల్పిస్తున్నారు. మోల్ సాఫ్ట్ సాధనాలను ఉపయోగించి కంప్యూటేషనల్ డ్రగ్ డిజైన్ పై ప్రత్యేక సెషన్లు నిర్వహిస్తున్నారు. అలాగే అధునాతన ఔషధ పంపిణీ వ్యవస్థలలో త్రీడీ ప్రింటింగ్ అనువర్తనంపై ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో ప్రదర్శిస్తున్న కీలక సాంకేతికతలలో హై-ఫెర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమాటోగ్రఫీ (హెచ్పీఎల్సీ), ప్రిపరేటివ్ హెచ్పీఎల్సీ, హై-ప్రెజర్ హోమోజనైజర్స్ (హెచ్.పీ.హెచ్), రియోమీటర్ల వంటి అధునాతన ఫార్ములేషన్ అభివృద్ధి పరికరాలతో పాటు, ఇతర అత్యాధునిక ఔషధ విశ్లేషణ పరికరాలున్నాయి.

ఈ కార్యక్రమం అధునాతన ఔషధ పంపిణీ వ్యవస్థలు, ఫార్ములేషన్ అభివృద్ధి, ఔషధ ఉత్పత్తులు ప్రయోగశాల స్థాయి పరిశోధన నుంచి పారిశ్రామిక తయారీకి మారే కీలక పరివర్తనపై లోతైన అవగాహనను కల్పిస్తోంది. ఔషధ ఉత్పత్తుల భద్రత, సమర్థతను నిర్ధారించడంలో కీలకమైన అంశాలైన ప్రక్రియ ఆప్టిమైజేషన్, నాణ్యత హామీ, నియంత్రణ నిబంధనలు అమలుపై ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు.

స్కూల్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.శివకుమార్ పర్యవేక్షణలో, అధ్యాపక బృంద సహకారంతో డాక్టర్ ప్రతీక్ పాఠక్, డాక్టర్ పూజా మిట్టల్ తదితరులు ఈ కార్యక్రమాన్ని సమర్థంగా సమన్వయం చేస్తున్నారు. ఇది గురువారం వరకు కొనసాగనుంది.అనుభవపూర్వక అభ్యాసం పట్ల గీతం యొక్క నిబద్ధతకు, విద్యా పరిజ్జానానికి, పరిశ్రమ ఆధారిత ఔషధ పరిశోధనలకు మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చడానికి చేస్తున్న నిరంతర ప్రయత్నాలకు ఈ కార్యక్రమం ఓ నిదర్శనంగా నిలుస్తోంది.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

10 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

10 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

10 hours ago