politics

ముఖ్యమంత్రి దేశప్రజలకు క్షమాపణ చెప్పాలి_రాష్ట్ర బిజెపి మహిళా ప్రధాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి

మనవార్తలు,రామచంద్రపురం

రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ ను అవమానపరిచిన ముఖ్యమంత్రికి పదవిలో కొనసాగే అర్హత లేదని వెంటనే రాజీనామా చేసి వెంటనే దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని గోదావరి అంజిరెడ్డి డిమాండ్ చేశారు.సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పట్టణం లో బిజెపి రాష్ట్ర మరియు జిల్లా కమిటి ఆదేశానుసారం రాష్ట్ర బిజెపి మహిళా ప్రధాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి పట్టణ బిజెపి పార్టీ కార్యాలయంలో జైభీందీక్షకు దిగారు. ఈ సందర్బంగా గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ ముఖ్య మంత్రి భారత రాజ్యాంగాన్ని మార్చాలని దళితులను మరియు డా. అంబేద్కర్ అవమానించే విధంగా మాట్లాడటం సరికాదు అని అన్నారు .

అదేవిధంగా 7సం ల కాలంలో దళితుణ్ని ముఖ్యమంత్రి చెస్తాను అని, మూడు ఎకరాల భూమి ఇస్తానని, దళితబందు అమలుచెస్తా అని అన్ని బూటకపు మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు అని అన్నారు. ఈ చేతకాని ముఖ్య మంత్రి రాజ్యాంగాన్ని మార్చాలనడం రాజ్యాంగం గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరికాదని ఆమె అన్నారు .ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు అంజిరెడ్డి, ఓబీసీ మోచ అధ్యక్షులు యాదగిరి, మల్లేష్, రవీందర్ గౌడ్,లక్ష్మణ్, పెంటారెడ్డి, రాంబాబు, రాజు, కృష్ణ రెడ్డి, రమేశ్ గుప్తా, లక్ష్మణ్ గౌడ్, కటికే శ్రీను, శ్రీనివాస రావు, మైనారిటీ నాయకులు షఫి,సల్మాన్, బాబ్జీ,ప్రసాద్ రావు,అమృత,అజాజ్ తదితరులు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago