మనవార్తలు ,పటాన్ చెరు:
తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలతో ప్రజలను కన్నబిడ్డల్లా ఆదుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను పెద్ద కొడుకుగా ప్రతీ ఇంటిలో ఆశీర్వదిస్తున్నారని చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు పటాన్చెరు మండలం ఇస్నాపూర్ అనాధ వృద్ధాశ్రమంలో నిత్యవసర వస్తువులు, పండ్లు, 5000 రూపాయలు అందించారు .మానవసేవే మాధవసేవ అన్న నానుడిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అనాధలను ఆదుకోవాల్సిన అవసరం ఉందని సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా అనాధాశ్రమం లో వృద్ధులకు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు .వారందరూ సంతోషించి రాష్ట్ర ముఖ్యమంత్రిని పది కాలాలపాటు చల్లగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్ధించారని అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎంఎం యువసేన సభ్యులు అనిల్, మురళి, విష్ణువర్ధన్, నాగేందర్, శ్రీకాంత్, ప్రవీణ్, జగదీష్, బాలు, మోజేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…