politics

నేడు పటాన్ చెరులో ఛట్ పూజ

 

_ఎమ్మెల్యే జిఎంఆర్ సహకారంతో భారీ స్థాయిలో ఏర్పాట్లు

_మైత్రి మైదానంలో భారీ జాగరణ

_ముఖ్య అతిథిగా భోజ్ పురి నటుడు కేసరి లాల్ యాదవ్

 

మనవార్తలు ,పటాన్ చెరు:

విభిన్న సంస్కృతి సాంప్రదాయాలకు నెలవైన పటాన్చెరు నియోజకవర్గంలో మరో భారీ కార్యక్రమానికి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారు అండగా నిలిచారు.మినీ ఇండియాగా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గంలో ఉత్తర భారతీయులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే ఛట్ పూజా సందర్భంగా భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు.ఇందుకు సంబంధించిన వివరాలను ఆదివారం ఉదయం సాకి చెరువు వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, ఉత్తర భారతీయుల అసోసియేషన్ ప్రతినిధి సందీప్ షా లు వెల్లడించారు.

నియోజకవర్గంలోని సబ్బండ వర్గాల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ఎమ్మెల్యే జిఎంఆర్ ఛట్ పూజా సందర్భంగా భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారని వారు తెలిపారు.సాకి చెరువు కట్టపై ఆదివారం సాయంత్రం నుండి సోమవారం ఉదయం వరకు నిర్వహించనున్న పూజల సందర్భంగా ప్రత్యేకంగా ఘాట్లు, లైటింగ్, మంచినీరు, గజ ఈతగాళ్లు, సంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.సోమవారం సాయంత్రం 6 గంటలకు స్థానిక మైత్రి మైదానంలో భోజ్పూర్ నటుడు కేసరి లాల్ యాదవ్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమానికి పటాన్చెరు నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుండి భారీ ఎత్తున ప్రజలు హాజరు కాబోతున్నట్లు తెలిపారు.ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలందరూ భారీ సంఖ్యలో కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

1 hour ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

1 hour ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

1 hour ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago