మనవార్తలు ,పటాన్చెరు
విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమవుతుందనీ టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర నాయకులు గూడెం విక్రం రెడ్డి అన్నారు. టిప్పు సుల్తాన్ సోషల్ సర్వీస్ సంస్థ ఆధ్వర్యంలో శనివారం పటాన్చెరు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వెయ్యి మంది విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన గూడెం విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ విద్య ద్వారానే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమాజంలోని రుగ్మతల పై పోరాడారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా టిప్పు సుల్తాన్ సోషల్ సర్వీస్ సంస్థను అభినందించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, సీనియర్ నాయకులు కృష్ణమూర్తి, తారా సింగ్, సోహెల్, సంస్థ ప్రతినిధులు ఫసి, ఫైజాన్, ఇలియాస్, ఇమ్రాన్, జైకుద్దిన్, తదితరుల పాల్గొన్నారు
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…