politics

అభివృద్ధి చెందే ప్రాంతాల్లో లాభసాటిగా రియల్ ఎస్టేట్_ కౌన్సిలర్ చంద్రారెడ్డి

మనవార్తలు ,బొల్లారం:

భవిష్యత్తులో అభివృద్ధి చెందే ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ లాభసాటిగా ఉంటోందని, ప్లాట్లు కొన్ని నెలల వ్యవధిలోనే అమ్ముడైతాయని తెరాసా సీనియర్ నాయకులు, బొల్లారం మున్సిపల్ కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి  అన్నారు. సోమవారం మున్సిపల్ లోని బీ.సీ కాలనీ లో మైత్రి కన్స్ట్రక్షన్స్ చెందిన రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని చంద్రారెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి చెందే ప్రాంతాల్లో వెంచర్‌లు కొనుగోలు చేయడానికి ప్రజలు మొగ్గు చూపుతారన్నారు. అంతే కాకుండా వెంచర్లలో రోడ్లు, డ్రెయినేజీ, విద్యుత్‌ మౌలిక వసతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. మంచి లక్ష్యంతో కొనసాగుతున్న మైత్రి కన్స్ట్రక్షన్స్, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార సంస్థ లాభాలతో ముందుకు సాగాలని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ముఖ్య అతిథులను శాలువాతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గోపాలమ్మ  , కొండ రెడ్డి  , మల్లిఖార్జున్ రెడ్డి  , అనిల్ రెడ్డి  , శ్రీధర్ రెడ్డి  , రాజ్ గోపాల్ (బొల్లారం మున్సిపల్ తెరాసా ఉపాధ్యక్షులు), చంద్రారెడ్డి  , దిననాధ్  , చక్రపాణి  (బొల్లారం మున్సిపల్ తెరాసా బి.సి.సెల్ అధ్యక్షులు), వెంకటయ్య  , నవీన్ రెడ్డి  , సంజీవ్  , సత్యనారాయణ  , చిన్నా  , దిగంబర్  , వెంకట్  తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago