Telangana

ఊయల కార్యక్రమానికి హాజరైన యలమంచి ఉదయ్ కిరణ్ ట్రస్ట్ ఛైర్మన్

మనవార్తలు ప్రతినిధి, మియాపూర్ :

మియాపూర్‌కు చెందిన ప్రముఖులు శ్రీ తాండ్ర మహిపాల్ గౌడ్ గారి కుటుంబంలో జన్మించిన నవజాత శిశువు ఊయల కార్యక్రమం మియాపూర్ హెచ్‌ఎమ్‌టీ స్వర్ణపురి కాలనీ కమ్యూనిటీ హాల్‌లో సంప్రదాయ పద్ధతుల్లో, భక్తిశ్రద్ధలతో మరియు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించబడింది.ఈ శుభకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మియాపూర్ డివిజన్ జనరల్ సెక్రటరీ శ్రీ యలమంచి ఉదయ్ కిరణ్ , శ్రీ మోహన్ ముదిరాజ్ , శ్రీ పల్లె మురళి  హాజరై నవజాత శిశువును ఊయలలో ఉంచి ఆశీర్వచనాలు అందజేశారు. శిశువు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కుటుంబ పెద్దలు శ్రీ రాంచందర్ గౌడ్ , శ్రీ శ్రీనివాస్ ముదిరాజ్, విజయ్, రమేష్, బాబు రావు, రత్నాచారి, సాయి తదితర కుటుంబ సభ్యులు చురుకుగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో హాజరైన బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు శిశువుకు దీర్ఘాయుష్షు, ఆరోగ్యం, విద్యాబుద్ధి, భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరాలని కోరుకుంటూ తమ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంలో, సంప్రదాయ వేడుకలతో అత్యంత వైభవంగా సాగింది.

admin

Recent Posts

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 hours ago

నాణ్యమైన మౌలిక సదుపాయాలకు వెన్నెముకగా మెట్రాలజీ

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…

2 hours ago

* భారతదేశంలోనే తొలి ‘సింగిల్-డే ఫేషియల్ ఆర్కిటెక్చర్’ సెంటర్

ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వి‌కేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…

1 day ago

గీతంలో సంక్రాంతి సంబరాలు

సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…

1 day ago

సీనియర్ సిటిజన్స్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటాం కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…

2 days ago

కాంగ్రెస్ శ్రేణుల సమిష్టి కృషితోనే కాంగ్రెస్ అభ్యర్థుల విజయం : నీలం మధు ముదిరాజ్..

కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…

2 days ago