Districts

సామాన్య ప్రజలపై భారం మోపుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

– పెంచిన చమురు, నిత్యవసర ధరలు వెంటనే తగ్గించాలి

– జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టిన కాంగ్రెస్ నాయకులు

మనవార్తలు ,పటాన్‌చెరు:

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్య ప్రజలపై భారం మోపుతున్నాయని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జి గాలి అనిల్ కుమార్, పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ లు ఆరోపించారు. టీపీసీసీ పిలుపు మేరకు పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, విద్యుత్, నిత్యవసర ధరలను వ్యతిరేకిస్తూ సోమవారం వారు పటాన్‌చెరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి జాతీయ రహదారిపై నిరసన చేపట్టారు. వెంటనే ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం తహశీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలతో సామాన్య ప్రజలు బ్రతకలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టానుసారంగా పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, విద్యుత్, నిత్యవసర ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ధరలను పెంచుతూ ప్రజలకు మరింత కష్టపెడుతున్నారని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. పెంచిన ధరలకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సపానదేవ్, సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్, ఎంపీపీ రవీందర్ గౌడ్, వైస్ ఛైర్మెన్ అనిల్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నరసింహ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, నియోజకవర్గ మండల ప్రెసిడెంట్స్ శ్రీకాంత్ రెడ్డి, వీరారెడ్డి, భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి మైనారిటీ ఛైర్మెన్ హబీబ్ జానీ, ఎస్సీ సెల్ డిపార్ట్‌మెంట్ యాదగిరి, మహేష్, సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago