పరీక్ష పేపర్లు, మూల్యాంకన రూపకల్పన కార్యశాలలో ముఖ్య అతిథి డాక్టర్ లీనా
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
విద్యార్థి సామర్థ్యాలను పరిశీలించే పద్ధతి, మూల్యాంకన విధానాలను వారిని ప్రోత్సహించి, మరింత పూనికతో పనిచేసేలా ఉండాలని ఇఫ్లూ విశ్వవిద్యాలయం, లఖిల భారత భాషోపాధ్యాయుల సంఘం డైరెక్టర్ డాక్టర్ లీనా ముఖోపాధ్యాయ స్పష్టీకరించారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, హైదరాబాద్ ఆధ్వర్యంలో ‘ప్రభావవంతంగా పరీక్ష పేపర్లు అభివృద్ధి చేయడం: బ్లూమ్ యొక్క వర్గీకరణ, మూల్యాంకన రూపకల్పనో అనే అంశంపై గురువారం నిర్వహించిన ఒకరోజు కార్యశాలలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కంటెంట్ మూల్యాంకనం యొక్క క్లిష్టమైన అంశాలపై ప్రస్తుతం అధ్యాపకులు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లను పరిష్కరించేలా పలు సూచనలతో ఆమె ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. ప్రభావంతమైన కంటెంట్ ను అభివృద్ధి చేయడానికి సవరించిన బ్లూమ్ వర్గీకరణ, కాగ్నిషన్ పరికల్పన ఆవశ్యకతను ఆమె నొక్కి చెప్పారు.గుర్తుంచుకోవడం, అర్థం చేసుకోవడం, విశ్లేషించడం, మూల్యాంకనం చేయడం, సృజనాత్మకంగా వ్యవహ రించడం వంటి ముఖ్య అంశాలపై ఆమె దృష్టి సారించారు. విద్యార్థి సామర్థ్యాన్ని మదింపు చేసేవారిగా ఉపాధ్యాయుల పాత్ర, అభ్యాస, ప్రక్రియలో విద్యార్థుల ఏకాగ్రతను పెంపొందించడంపై ఆమె ప్రసంగించారు.
జీఎస్ హెచ్ ఎస్ డైరెక్టర్ ప్రొఫెసర్ జి.సన్నీ జోస్ కార్యక్రమాన్ని ప్రారంభించి, ముఖ్య అతిథిని సత్కరించారు. అధ్యాపకులు తమ బోధనా పద్ధతులలో చేసుకోవాల్సిన మార్పులు, స్వీయ అంచనా ఆవశ్యకతను ఆయన నొక్కి చెబుతూ, ఈ కార్యశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆంగ్ల విభాగం అసోసియేట్ ప్రొఫెసర్లు డాక్టర్ అమిత్ కుమార్, డాక్టర్ రూత్ జర్జ్ మావి హౌజెల్ ల సమన్వయంతో సాగిన ఈ కార్యశాల, అధ్యాపకుల వికాసానికి, విద్యా పద్ధతులను మెరుగుపరచుకోవడానికి, వృత్తిపర అభివృద్ధికి తోడ్పడింది.
గీతమ్ లో ఘనంగా ఓనం ఉత్సవాలు
కేరళ వార్షిక పంటల, సాంస్కృతిక పండుగ ఓనంను గురువారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని డైరెక్టరేట్ ఆఫ్ స్టూడెంట్ లైఫ్ వారు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా గీతం విద్యార్థులకు సెంట్రల్ లాన్లో సంప్రదాయ ఆటలు, శివాజీ ఆడిటోరియంలో సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు వివిధ కార్యక్రమాలు: నిర్వహించారు.అందంగా అలంకరించిన పూల రంగోలి, శక్తివంతమైన కేరళ డ్రమ్ ప్రదర్శన (చెండా మేళం)లకు ఆకట్టుకునే సాంస్కృతిక ప్రదర్శనలు తోడై ఉత్సావాలకు మరింత శోభనిచ్చాయి, ఈ సందర్భంగా గీతం కేఫ్ లో పాయసం, ఇతర సంప్రదాయ కేరళ వంటకాలతో కూడిన ఓనం నేపథ్యంతో కూడిన ప్రత్యేక విందును కూడా ఏర్పాటు చేశారు.విద్యార్థులు కేరళ సంప్రదాయ వస్త్రధారణలో ఉత్సాహంగా ఆయా వేడుకలలో పాల్గొని, ఇదో మరుపురాని రోజుగా చేశారు. ఈ కార్యక్రమం పలు నేపథ్యాల నుంచి వచ్చిన విద్యార్థులందరినీ ఒకచోట చేర్చి వారిలో ఐక్యతను పెంపొందించడంతో పాటు సాంస్కృతిక నైపుణ్యాలకు పదును పెట్టింది అనడంలో అతిశయోక్తి లేదు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…