Telangana

జెకె ఫెన్నార్ ఎన్నికల్లో బిఆర్టియు విజయ దుందుభి

13 ఓట్ల తేడాతో ఘన విజయం

శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జిఎంఆర్

ప్రతి కార్మికుడికి రుణపడి ఉంటాం

ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం

బి.ఆర్.టి.యు నాయకులు..

బిఆర్టియు – 103

హెచ్ఎంఎస్ – 93

సిఐటియు – 48

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి:

డివిజన్ పరిధిలోని జెకె ఫెన్నార్ పరిశ్రమలో గురువారం నిర్వహించిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో బి ఆర్ టి యు విజయ దుందుభి మోగించింది. సమీప ప్రత్యర్థి యూనియన్ హెచ్ఎంఎస్ పై 13 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించింది. మొత్తం 247 ఓట్లలో  బిఆర్టియు కి 103, హెచ్ఎంఎస్ కి 93, సిఐటియుకి 48 ఓట్లు రాగా.. మూడు ఓట్లు చెల్లనివిగా నమోదయ్యాయి.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బి ఆర్ టి యు రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు, రాష్ట్ర కార్యదర్శి యాదగిరి యాదవ్ లు మాట్లాడుతూ… అనునిత్యం.. అనుక్షణం కార్మికుల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేసే బి ఆర్ టి యు గెలుపులో భాగస్వామ్యం ప్రతీ కార్మికుడికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తెలిపారు. పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి ల సహాయ సహకారాలతో, మార్గదర్శకత్వంలో ప్రతి కార్మికుడికి మెరుగైన వేతన ఒప్పందం, ఉద్యోగ భద్రత కల్పిస్తామని తెలిపారు. గౌరవ అధ్యక్షులుగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, అధ్యక్షులుగా రాంబాబు యాదవ్, ప్రధాన కార్యనిర్వహక అధ్యక్షులుగా యాదగిరి యాదవ్ లు ఎన్నికయ్యారు. సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే జిఎంఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన కార్మికులు 

జెకె ఫెన్నార్ పరిశ్రమలో భారీ విజయం సాధించిన అనంతరం బి ఆర్ టి యు నాయకులు, కార్మికులు పటాన్చెరులోని క్యాంపు కార్యాలయంలో స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ  బి ఆర్ టి యు విజయానికి నాయకులైన ప్రతి కార్మికుడికి అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని చిత్తశుద్ధితో అమలు చేయాల్సిన బాధ్యత కొత్త కార్యవర్గంపై ఉందని అన్నారు. పరిశ్రమ అభివృద్ధిలో కార్మికుల భాగస్వామ్యం అత్యంత విలువైనదని అన్నారు. కార్మికులకు అభినందనలు తెలిపారు.

admin

Recent Posts

అయ్యప్ప స్వామి పడి పూజలో పాల్గొన్న గడీల శ్రీకాంత్ గౌడ్

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన బీఆర్ఎస్ ఇంచార్జ్ గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు .ఇస్నాపూర్ మున్సిపల్…

3 hours ago

బీహెచ్ఈఎల్ టౌన్‌షిప్‌లో ఘనంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు

రామచంద్రపురం , మనవార్తలు ప్రతినిధి: మత సామరస్యం, సోదరభావంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని…

6 hours ago

ఛట్ పూజ సందర్భంగా ఉత్తర భారతీయులకు చెరుకు పంపిణీ చేసిన మాద్రి పృథ్వీరాజ్

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: పటాన్‌చెరు: ఉత్తర భారతీయులు భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్ర ఛట్ పూజను పురస్కరించుకుని యండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో…

20 hours ago

సీఎస్ఈలో గీతం స్కాలర్ కు పీహెచ్.డీ

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక…

21 hours ago

శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో వైభవంగా మహా చండీయాగం

ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్‌చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం దంపతులు రెండు వేల…

21 hours ago

తెల్లాపూర్ నైబర్‌హుడ్ అసోసియేషన్ (తేనా)కు జాతీయ స్థాయి పురస్కారం

- సమాజాభివృద్ధికి అందించిన సేవలకు జాతీయ గుర్తింపు - పౌర సమస్యల పరిష్కారం, పర్యావరణ పరిరక్షణలో విశిష్ట కృషి -…

21 hours ago