Telangana

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆలయాలకు పునర్వైభవం _ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

రాష్ట్రంలో పురాతన ఆలయాల పునర్నిర్మాణంతో పాటు నూతన ఆలయాల నిర్మాణాలు, కల్యాణ మండపాల నిర్మాణాలు చేపడుతూ ప్రభుత్వం ఆధ్యాత్మికతకు పెద్దపీట వేస్తున్నదని టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ అన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆలయాల నిర్మాణానికి, పునర్నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. టెంపుల్ టూరిజం కూడా పెద్దపీట వేస్తుందని నీలం మధు ముదిరాజ్ అన్నారు.అందోల్ నియోజకవర్గపరిధిలోని, అందోల్ మండలం మసానిపల్లి గ్రామంలో దేవాలయ కమిటీ చైర్మన్ పి నారాయణ ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి దేవాలయానికి నిర్వహించిన శంకుస్థాపనలో నీలం మధు ముదిరాజ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ దేవాలయం నిర్మాణానికి తన వంతు సహకారంగా 4 లక్షల రూపాయలు స్టీల్ అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. జాతరలు ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తుండటంతో గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణ చోటు చేసుకుటుందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పండుగలకు ప్రాధాన్యత కల్పించిందన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పి చైర్ పర్సన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి గారు, డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, మున్సిపల్ కౌన్సిలర్ పులిమామిడి రాజుగారు, సిద్దేశ్వర్,చాపల వెంకటేశం,నాగభూషణం, చింతల నర్సింలు, ఏరారం సర్పంచ్ ప్రవీణ్ రెడ్డి,తాడు మనూరు సర్పంచ్ అనిల్ రెడ్డి, వివిధ గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజలు, ఎన్ఎమ్అర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు

admin

Recent Posts

సమస్యల గురించి ప్రశ్నించిన విద్యార్థులకు వేధింపులా

ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిని వెంటనే సస్పెండ్ చేయాలి ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు అర్జున్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:…

17 minutes ago

పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వర్కర్లకు కనీస వేతనం 26 వేలు చెల్లించాలి

సిఐటియు ఆధ్వర్యంలో ఆసుపత్రి సూపర్ డెంట్ కు వినతి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు మనవార్తలు ప్రతినిధి ,…

18 minutes ago

లక్డారం రైతుల భూములను రక్షించాలి

ఎస్ టిపి ప్లాంటు ఏర్పాటును విరమించుకోవాలి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా, కలెక్టర్ కు వినతి మనవార్తలు ప్రతినిధి…

20 minutes ago

గీతంలో ఉత్సాహభరితంగా యోగా దినోత్సవం

ఆనందంగా పాల్గొన్న గీతం ఉన్నతాధికారులు, సిబ్బంది, విద్యార్థులు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఆరోగ్యం, శ్రేయస్సుకు యోగాను ఒక సంపూర్ణ…

30 minutes ago

ఫ్యూజన్ ఫిట్‌నెస్ స్టూడియో ఆధ్వర్యంలో ప్రత్యేక యోగా

మనవార్తలు ప్రతినిధి , రామచంద్రపురం : యోగాతో శరీరం, మనస్సు, ఆత్మకు సమతుల్యత లభిస్తుందని భారతీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్…

14 hours ago

యండిఆర్ ఫౌండేషన్ కు 23వ జాతీయ అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: సామాజిక సేవ కార్య‌క్ర‌మాల నిర్వ‌హిస్తున్న ఎండీఆర్ ఫౌండేష‌న్ ఖాతాలో మ‌రో అవార్డు ద‌క్కింది .…

15 hours ago