Hyderabad

మాదాపూర్ లో సవర్ట్ ప్రధాన కార్యాలయంను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయనపల్లి వినోద్ కుమార్

మనవార్తలు ,హైదరాబాద్:

హైదరాబాద్‌ మహానగరం త్వరలోనే అంతర్జాతీయ మార్కెట్‌ కేంద్ర మారుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్‌కుమార్‌ అన్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులకు హైదరాబాద్ అనువైన నగరమన్నారు. మెరుగైన మౌళిక వసతులు..పటిష్టమైన శాంతిభద్రతలతో పాటు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం కారణంగా అనేక సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

మాదాపూర్ లో ఏర్పాటు చేసిన ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ అండ్ టెక్నాలజీ కంపనీ సవర్ట్ ప్రధాన కార్యాలయాన్ని ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్ని ప్రారంభించారు. ప్రత్యేక రాష్టం ఏర్పాటైన తర్వాత టీఎస్ ఐపాస్ లాంటి విధానాలను ప్రవేశ పెట్టిన ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన సహకారం అందిస్తోందన్నారు.

అంతర్జాతీయంగా పేరొందిన బహుళ జాతి కంపనీలు హైదరాబాద్ లో తమ కార్యాలయాలు ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతాయన్నారు. 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా కారణంగా వ్యవసాయంతో పాటు పారిశ్రామికరంగాభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుందన్నారు. ఒక చిన్న కంపెనీ ప్రారంభమై నేడు దేశంలోనే ఒక ప్రముఖ కంపెనీగా మారిందని సవర్ట్‌ కంపెనీ వ్యవస్థాపకులు సంకర్షచంద్రా అన్నారు. హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంగా గ్లోబల్‌ విస్తరణ కోసం ప్రణాళికలను ఆయన ప్రకటించారు. త్వరలోనే కెనాడ, జర్మనీ వంటి దేశాల్లో సైతం తమ కంపెనీలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో వినోద్‌కుమార్‌, సంస్థ వ్యవస్థాపకులు సంకర్ష్‌ చంద్రాతో పాటు కంపెనీ ప్రతినిధులు, ఇన్వెస్లర్లు పాల్గొన్నారు.

admin

Recent Posts

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago

నాణ్యమైన మౌలిక సదుపాయాలకు వెన్నెముకగా మెట్రాలజీ

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…

2 days ago

* భారతదేశంలోనే తొలి ‘సింగిల్-డే ఫేషియల్ ఆర్కిటెక్చర్’ సెంటర్

ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వి‌కేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…

3 days ago

గీతంలో సంక్రాంతి సంబరాలు

సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…

3 days ago

సీనియర్ సిటిజన్స్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటాం కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…

4 days ago

కాంగ్రెస్ శ్రేణుల సమిష్టి కృషితోనే కాంగ్రెస్ అభ్యర్థుల విజయం : నీలం మధు ముదిరాజ్..

కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…

4 days ago