Hyderabad

బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక

ఫలహారం బండి ఊరేగింపు లో పాల్గొన్న శాసనమండలి చైర్మన్ భూపాల్ రెడ్డి, ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు

పటాన్చెరువు పట్టణంలో బోనాల పండుగ, ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమాలతో సంబరాలు అంబరాన్నంటాయి. జిఎంఆర్ యువసేన ఆధ్వర్యంలో మహంకాళి దేవాలయం నుండి చేపట్టిన ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమాన్ని శాసనమండలి చైర్మన్ భూపాల్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి లు ప్రారంభించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే జిఎంఆర్ తీన్మార్ స్టెప్పులు వేసి అందరి లో ఉత్సాహం నింపారు.

 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ బోనాల పండుగను అధికార పండుగగా ప్రకటించడం జరిగిందన్నారు. ప్రపంచంలోని నలుమూలలా బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయన్నారు. ఈ పండుగ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోందన్నారు.

అనంతరం పట్టణంలోనీ ఏడు గుల్ల పోచమ్మ దేవాలయం, యాదవుల బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, సీఐ వేణుగోపాల్రెడ్డి, మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆదర్శ్ రెడ్డి, విజయ్ కుమార్, యాదగిరి యాదవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశోక్, వెంకటేష్, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర మరింత పెరగాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…

5 minutes ago

మీ ఆలోచనే మీకు పెట్టుబడి

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…

3 hours ago

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

1 day ago

సీఎం కప్ లో గీతం విద్యార్థికి మూడు బంగారు పతకాలు

పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ చాటిన బీ.ఆర్క్. విద్యార్థిని ఆశ్రిత రాజు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం డీమ్డ్…

1 day ago

ప్రజా సంక్షేమమే మా లక్ష్యం పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

54 మంది లబ్ధిదారులకు 24 లక్షల 43 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,…

2 days ago

జిన్నారం శ్రీ జీవనజ్యోతి జ్యోతిర్లింగం క్షేత్రం అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో…

3 days ago