మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు:
తెలుగు రాష్ట్రాల్లో ఊరు-వాడలా వినాయక నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. భక్తులు ప్రతి మండపంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తూ విఘ్నేశుడిని కొలుస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలో కొలువుదీరన గణనాధులకు సంగారెడ్డి జిల్లా బీజేపీ స్పోర్ట్స్ సెల్ కన్వీనర్ ,కే కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ చైర్మన్ కంజర్ల కృష్ణమూర్తి సందర్శించారు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఎల్ఐజి భారతి నగర్ డివిజన్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో రామచంద్రాపురం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
యేసయ్య హాస్పిటల్ రామాలయం దగ్గర రామసేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని దర్శించుకుని వినాయకుని పూజల కొరకు చందా అందించారు, ఓల్డ్ ఎంఐజి కాలనీలోని బజరంగ్ సేన యూత్ అసోసియేషన్ నిర్వహించిన వినాయక మండపాన్ని దర్శించుకుని అన్న ప్రసాదం కార్యక్రమాల కోసం చందాను అందజేశారు. ఎల్ఐజి భారతి నగర్ స్వామి వివేకానంద పార్క్ ఎదురుగా స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని దర్శించుకుని అన్నదాన కార్యక్రమం కొరకు చందా అందజేశారు .
భారతి నగర్ విద్యుత్ నగర్ కాలనీలో బాల గణేష్ యూత్ ఏర్పాటు చేసిన వినాయకుని దర్శించుకుని యువసేన సభ్యులకు అన్నసమారాధన కార్యక్రమం కొరకు చందాను అందజేశారు,అనంతరం కంజర్ల కృష్ణమూర్తి మాట్లాడుతూ వినాయక నవరాత్రి ఉత్సవాలను ఎంతో ఉత్సాహంగా నిర్వహిస్తున్న యూత్ అసోసియేషన్ ప్రతినిధులను అభినందించారు. ఆ వినాయకుడి దయతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు .
-జర్నలిస్టుల రక్తదాన శిబిరం గ్రేట్ -అభినందించిన జిల్లా కలెక్టర్ శాలువాతో సత్కారం ,ప్రశంసా పత్రం అందజేత మనవార్తలు ప్రతినిధి…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : హైదరాబాద్, సెప్టెంబర్ 2026: అంతర్జాతీయ హై-స్ట్రీట్ ఫ్యాషన్ బ్రాండ్ కెల్లీ ఫెల్డర్ భారత మార్కెట్‌లోకి…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : హైదరాబాద్, సెప్టెంబర్ 2026: ఆసియాస్ బిగ్గెస్ట్ నవరాత్రి బాష్ 2026 వేడుక సన్నాహక పోస్టర్…
మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పట్టణంలోని శాంతినగర్‌లో గోపాల్ దాస్ సిద్ధి వినాయక ఉత్సవ…
మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: సంగారెడ్డి జిల్లా,పటాన్ చెరు పట్టణంలోని ముదిరాజ్ భవన్ పక్కన ఉన్న 'యూరో కిడ్స్ స్కూల్'…
పటాన్ చెరులో ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు 200 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన…