Telangana

వీ హబ్ ను సందర్శించిన గీతం విద్యార్థినులు

గీతం మహిళా సాధికారిత సెల్ ఆధ్వర్యంలో ఏర్పాటు

వ్యవస్థాపకత, స్టార్టప్ లపై అవగాహన

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు:

హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం విద్యార్థినులు బుధవారం వీ హబ్ (WE HUB)ను సందర్శించారు. గీతం మహిళా సాధికారత సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పారిశ్రామిక సందర్శన ద్వారా విద్యార్థులకు వ్యవస్థాపకత, స్టార్టప్ పర్యావరణ వ్యవస్థపై విలువైన అవగాహన కల్పించారు.

మహిళా సాధికారత సెల్ ఛైర్ పర్సన్ ప్రొఫెసర్ ప్రీతి పర్వేకర్ పర్యవేక్షణలో, సుమారు 40 మంది విద్యార్థినులు, ఐదుగురు మహిళా అధ్యాపకులు ఈ సందర్శనలో పాల్గొన్నారు. మహిళా పారిశ్రామికవేత్తల కోసం భారతదేశపు మొట్టమొదటి రాష్ట్ర-ఆధారిత నోడల్ సంస్థ అయిన వీ హబ్, విద్యార్థులకు ఆవిష్కరణ, వ్యాపార సృష్టి, మార్గదర్శకత్వం, నెట్ వర్కింగ్, పారిశ్రామిక మద్దతుపై అవగాహన కల్పించారు.

ఈ సందర్శన ద్వారా విద్యార్థులు తరగతి గదిలో నేర్చుకున్న విషయాలను వాస్తవ ప్రపంచ పారిశ్రామిక పద్ధతులతో అనుసంధానించుకోవడంతో పాటు, మహిళా నేతృత్వంలోని వ్యవస్థాపకత, నాయకత్వం, సృజనాత్మకత, సమస్య-పరిష్కారంపై అవగాహన పొందారు. ఇది వారి వృత్తిపరమైన, వ్యక్తిగత అభివృద్ధికి దోహదపడే ఒక అర్థవంతమైన అనుభవపూర్వక అభ్యాస అవకాశంగా ఉపయోగపడింది.ఈ సందర్శనలో సీఎస్ఎస్ఈ విభాగం నుంచి జ్యోతి బంకాపల్లి, డాక్టర్ అపర్ణ, ఆర్కిటెక్చర్ విభాగం నుంచి డాక్టర్ సౌపూర్ణి పాల్, మనస్తత్వశాస్త్ర విభాగం నుంచి డాక్టర్ దుర్గేష్ నందిని తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.

విద్యార్థుల కోసం ఇటువంటి విజ్జానదాయకమైన, పరిశ్రమల ఆధారిత కార్యక్రమాలను ఏర్పాటు చేసినందుకు విశ్వవిద్యాలయ నాయకత్వానికి, మహిళా సాధికారత విభాగానికి విద్యార్థి బృందం హృదయపూర్వక కృతజ్జతలు తెలియజేసింది.

admin

Recent Posts

శ్రీశ్రీశ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయాన్ని తక్షణమే పునర్నిర్మించాలి: కంజర్ల కృష్ణమూర్తి చారి

-విగ్రహ ధ్వంసాన్ని నిరసిస్తూ నర్సాపూర్‌లో విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మల భారీ ర్యాలీ -దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ -ఆలయ పున ప్రతిష్ఠకు…

6 minutes ago

హైటెక్ సిటీలో ‘హైలైఫ్ ఎగ్జిబిషన్’ ప్రారంభం.. తళుక్కుమన్న సినీ తారలు

ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన నటీమణులు రితు చౌదరి, వర్ష, రుక్సార్ పటేల్ నవంబర్ 15 నుంచి 17 వరకు నోవోటెల్…

37 minutes ago

అయ్యప్ప స్వామి పడి పూజలో పాల్గొన్న గడీల శ్రీకాంత్ గౌడ్

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన బీఆర్ఎస్ ఇంచార్జ్ గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు .ఇస్నాపూర్ మున్సిపల్…

4 hours ago

బీహెచ్ఈఎల్ టౌన్‌షిప్‌లో ఘనంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు

రామచంద్రపురం , మనవార్తలు ప్రతినిధి: మత సామరస్యం, సోదరభావంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని…

6 hours ago

ఛట్ పూజ సందర్భంగా ఉత్తర భారతీయులకు చెరుకు పంపిణీ చేసిన మాద్రి పృథ్వీరాజ్

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: పటాన్‌చెరు: ఉత్తర భారతీయులు భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్ర ఛట్ పూజను పురస్కరించుకుని యండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో…

21 hours ago

సీఎస్ఈలో గీతం స్కాలర్ కు పీహెచ్.డీ

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక…

22 hours ago