పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
హెదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం ‘ ప్రపంచ బయో – ఎంజెమ్ దినోత్సవాన్ని ‘ ఘనంగా నిర్వహించారు . భారతీయ మహిళా ఛాంబర్ ఆఫ్ కామర్స్ , ఇండస్ట్రీ ( డబ్ల్యూఐసీసీఐ ) , హెదరాబాద్ లోని బయో – ఎంజెమ్ కౌన్సిల్ , భారతీయ బయో – ఎంజెమ్ ఎంటర్టైన్యూర్స్ అకాడమీల సౌజన్యంతో ఈ వేడుకలు జరుపుకున్నారు . ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర డబ్ల్యూఐసీసీఐ ఉపాధ్యక్షురాలు రేవతి మాచర్ల , బయో – ఎంజెమై ఆవిష్కర్త డాక్టర్ రోసుకాన్ పూంపన్వాంగ్ సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు . సహజ సిద్ధ పదార్థాలతో బయో – ఎంజెమై తయారీ విధానాలను గీతమ్లోని ఈ – క్లబ్ , ఆవిష్కరణల మండలి , ఫార్మసీ విద్యార్థుల అసోసియేషన్ల విద్యార్థులకు ఆమె ఉద్బోధించారు . వారితో వాటిని తయారు చేయించడమే గాక , అప్పటికే తయారు చేసి సిద్ధంగా ఉన్న బయో – ఎంజెలో గీతం పక్కనే ఉన్న నీటి కుంటలో కలిపించారు . మనం రసం తీసుకున్నాక పడేసే నారింజ , నిమ్మ , బత్తాయి తొక్కలతో సిట్రస్ బయో – ఎంజెమైను తయారు చేసినట్టు చెప్పారు . చెరువులోని మురికి , చెడు దుమ్ములను ఈ ఎంజెమ్ తినేస్తుందని , తద్వారా నీరంతా శుద్ధి అవుతుందన్నారు . ఈ ఎంజెమ్ ఉపయుక్తమైన బాక్టీరియాను పెంపొందించడంతో పాటు నీటిలో ఆక్సిజన్ స్థాయిని మెరుగుపరుస్తుందని , నీటి మొక్కలకు ఉపకరిస్తుందని చెప్పారు . ఈ ప్రక్రియలను విద్యార్థులంతా తమ ఇళ్లలో ఆచరించడం ద్వారా వ్యర్థాల పునర్వినియోగించడంతో పాటు పర్యావరణాన్ని కూడా పరిరక్షించవచ్చని ఆమె ఉద్బోధించారు . విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు జవాబులివ్వడమే గాక , వారితో ఆయా ప్రక్రియలన్నింటినీ చేయించడం విశేషం .
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…