Telangana

బయో క్లబ్ సోడాస్ ప్రపంచంలోని మొట్టమొదటి భారతీయ తయారీ డ్రింక్స్

మనవార్తలు ,హైదరాబాద్:

దేశీయంగా చేసిన బయో బెవరేజెస్ శ్రేణిని బ‌యో ఇండియా సంస్థ అధికారికంగా హైద‌రాబాద్ మార్కెట్‌లోకి ప్ర‌వేశ‌పెడుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. బంజారాహిల్స్‌లోని తాజ్ డెక్క‌న్ హోట‌ల్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో బయో బెవరేజెస్ ఆవిష్కర్త డాక్టర్ శ్రీనివాస్ అమర్‌నాథ్ మాట్లాడుతూ, త‌మ ఉత్ప‌త్తులు సింథటిక్ రుచులు, రంగులు లేని సహజ సుగంధాలతో ఉంటాయ‌ని, సాంప్రదాయ ఉత్ప‌త్తుల‌తో పోలిస్తే అదే శాతంలో మత్తు ప్రభావాలను అందిస్తాయ‌న్నారు. రెండు దశాబ్దాల నైపుణ్యం   నుండి వీటిని కానుకొన్నామని, డాక్టర్ శ్రీనివాస్ అమర్‌నాథ్ వివ‌రించారు. బయో బెవరేజెస్ యొక్క ఫ్రాంచైజీ అయిన వీఎస్ఎస్ బెవరేజెస్ ద్వారా బయో బెవరేజెస్ ఉత్పత్తులను తెలంగాణలో తయారు చేసి విక్రయిస్తున్నారు. టుడే’స్ స్పెషల్ బయో విస్కీ, డైలీస్ స్పెషల్ బయో బ్రాందీ మరియు వైల్డ్ ఫాక్స్ విస్కీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అందుబాటులో ఉన్న బ్రాండ్‌లు. “బయో బెవరేజెస్ ఏ సింథటిక్ రుచులు మరియు రంగులను ఉపయోగించకుండా ఉత్తమ బొటానికల్స్, హై క్వాలిటీ స్పిరిట్స్, మాల్ట్ మరియు బయో ఆల్కలాయిడ్స్‌తో తయారుచేయబడ్డాయి. నేను ప్రపంచంలో వినియోగదారుల ఎంపికను దృష్టిలో ఉంచుకుని మొదటిసారిగా బయో లిక్కర్ ను అభివృద్ధి చేసాను, అని డాక్టర్ శ్రీనివాస్ అమర్‌నాథ్ వివ‌రించారు.

శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ వైద్యుడు మరియు వృక్షశాస్త్రజ్ఞుడు (బొటనిస్ట్ ), ఇందిరాగాంధీ ప్రియదర్శిని ప్రెసిడెంట్ అవార్డ్స్ తో సత్కరించబడిన డాక్టర్ శ్రీనివాస్ అమర్‌నాథ్ మాట్లాడుతూ, మద్యపాన సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న రోగులను తాను తరచుగా చూస్తుంటానని, మరియు బయో బ్రాండ్స్ ను రూపొందించడానికి అమెరికా మరియు వివిధ దేశాలలో ఎన్నో సంవత్సరాలు రిసెర్చ్ చేసి, అమెరికా లో ఫెడరల్ గవర్నమెంట్ చే అప్రూవల్ పొంది బయో బెవరేజెస్ ని కనిపెట్టడం లో విజయం సాధించామని అన్నారు. మన భారత దేశం లో వివిధ రాష్ట్రాల్లో బయో బెవరేజెస్ కస్టమర్లకి అందుబాటులో ఉన్నాయని డాక్టర్ శ్రీనివాస్ అమర్‌నాథ్ తెలిపారు”

తెలంగాణ ఫ్రాంచైజీ వీఎస్ఎస్ బెవరేజెస్ యొక్క ఆపరేషన్స్ మేనేజర్ శ్రీ ప్రదీప్ మాట్లాడుతూ, “వివిధ రకాల బ్రాండ్‌లకు వినియోగదారులు ప్రాధాన్యతనిస్తూ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌లలో తెలంగాణ ఒకటి. వినియోగదారుల ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని, మేము మా మొట్టమొదటి బయో బెవరేజెస్ శ్రేణి ఉత్పత్తులను పరిచయం చేసాము, తెలంగాణ మాకు కీలకమైన మార్కెట్‌గా ఉన్నందున, ఈ అద్భుతమైన ఆవిష్కరణను తెలంగాణ కు అందించడానికి మేము చాలా సంతోషిస్తున్నాము. అని ఆయన వివరించారు. సంస్థ మేనేజింగ్ డైర‌క్ట‌ర్ శ్రీనివాస రాయ‌లు మాట్లాడుతూ ఇటీవ‌ల యూఎస్‌లో నిర్వ‌హించిన ఓ కార్య‌క్ర‌మంలో బ‌యో బెవరేజెస్ ప్ర‌శంస‌లు అందుకున్నాయ‌న్నారు. పరిశోధన, అభివృద్ధి, మార్కెటింగ్‌లో గణనీయమైన పెట్టుబడులు పెట్టడం, ప్రపంచవ్యాప్తంగా పరిశోధన మరియు అభివృద్ధి కోసం ప్రపంచ వ్యాప్తంగా సుమారు 10 మిలియన్ డాల‌ర్లు ఖర్చు చేసినట్టు ఆయ‌న వివ‌రించారు.

admin

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

2 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

2 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

2 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

1 week ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

1 week ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

1 week ago