Telangana

పాశమైలారం పారిశ్రామిక వాడలో సిఐటియు ఆధ్వర్యంలో ఘనంగా భగత్ సింగ్ వర్ధంతి

ప్రపంచ ఆధిపత్యం కోసమే అమెరికా దాడులు

భగత్ సింగ్ స్ఫూర్తితో సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం

బ్రిటిష్ తెల్ల దొరల నుండి భారతదేశ విముక్తి కోసం ప్రాణ త్యాగం చేసిన గొప్ప పోరాట వీరుడు భగత్ సింగ్

సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

మనవార్తలు ప్రతినిధి – పటాన్ చెరు:

ప్రపంచ ఆధిపత్యం కోసమే అమెరికా సామ్రాజ్యవాదం దాడులు చేస్తుందని భగత్ సింగ్ స్ఫూర్తితో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం నిర్వహించాలని సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్ పేర్కొన్నారు.భగత్ సింగ్ 95వ వర్ధంతి సందర్భంగా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పాశమైలారం పారిశ్రామిక వాడలో సిఐటియు ఆధ్వర్యంలో బిపిఎల్ చౌరస్తా వద్ద భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా మాణిక్ మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యవాదాల నుండి భారతదేశ విముక్తి కోసం 23 ఏళ్ల అతి చిన్న వయసులోనే ప్రాణ బలిదానం చేసిన గొప్ప విప్లవ వీరుడు భగత్ సింగ్ అన్నారు.. 1931 మార్చి 23న భగత్ సింగ్, రాజు గురు సుకుదేవులను బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసిందని అన్నారు. వారు దేశం కోసం ప్రాణాలర్పించిన యువకిశోరాలని కొనియాడారు. దేశానికి స్వాతంత్రం వస్తేనే సరిపోదని, ప్రజలందరికీ కూడు,గుడ్డ,గూడు,విద్య,వైద్యం అందాలని కోరుకున్నాడని గుర్తు చేశారు. కానీ నేడు పాలకులు అనుసరిస్తున్న విధానాలతో నిరుద్యోగం పేదరికం దారిద్ర్యం తాండవిస్తుందని ఆరోపించారు. సమానత్వం కుల రహిత సమాజం కోసం భగత్ సింగ్ కన్న కలలు నెరవేరలేదని, అవి సోషలిస్టు వ్యవస్థలోనే సాధ్యమవుతుందని భగత్ సింగ్ నమ్మారని అన్నారు.. ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదం లాగానే నేడు అమెరికన్ సామ్రాజ్యవాదం ప్రపంచ దేశాలపై ఆధిపత్యం చలాయించాలని కుటీల ప్రయత్నం చేస్తుందని, అందుకోసమే అనేక దేశాల మీద దాడులు చేస్తుందని విమర్శించారు. భారతదేశాన్ని అమెరికా సామ్రాజ్యవాదానికి మోడీ ప్రభుత్వం తాకట్టు పెడుతుందని విమర్శించారు. భగత్ సింగ్ స్ఫూర్తితో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మరో స్వాతంత్ర పోరాటం నిర్వహించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.కిర్బీ, పార్లే, ఎనర్జీ, సువెన్ యూరోపియన్లు ఘన నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు సుధాకర్ రాజు శాంత కుమార్ ఇండస్ట్రియల్ క్లస్టర్ నాయకులు జైపాల్, వెంకటేష్, దుర్గేష్, శ్రీనివాస్ గౌడ్, భాస్కర్, శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

సర్వమతాల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యం.. ఎమ్మెల్యే జిఎంఆర్

36 లక్షల రూపాయలతో గుమ్మటాలకు ప్రహారీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన.. మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు :…

17 hours ago

అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్: మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారతదేశ సామాజిక, రాజకీయ చరిత్రలో అణగారిన వర్గాల గొంతుకను వినిపించిన మహోన్నత…

17 hours ago

డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకం

పటాన్ చెరులో ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారత మాజీ…

17 hours ago

​బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగజీవన్ రామ్_యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారత మాజీ ఉప ప్రధాని, స్వాతంత్ర్య సమరయోధుడు బాబు జగజీవన్ రామ్…

17 hours ago

నూతన మున్సిపాలిటీలలో అభివృద్ధిని పరుగులు పెట్టించండి

అతి త్వరలో 75 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. ప్రతి మున్సిపాలిటీలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వండి..…

1 day ago

ఏసుక్రీస్తు బోధనలు ఆచరణీయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరులో ఘనంగా రన్ ఫర్ జీసస్ కార్యక్రమం మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : ఏసుక్రీస్తు బోధనలు…

2 days ago