_ముఖ్య అతిథిగా పాల్గొన్న అరబిందో ఉపాధ్యక్షుడు డాక్టర్ సత్యేంద్రనాథ్
పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ, హెదరాబాద్ మంగళవారం జాతీయ ‘ఉత్తమ తయారీ విధాన’ (జీఎంపీ) దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అరబిందో ఫార్మా అసోసియేట్ వెస్ట్ ప్రెసిడెంట్ (కార్పొరేట్ క్వాలిటీ) డాక్టర్ సీ.వీ. సత్యేంద్రనాథ్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ‘ఉత్తమ డాక్యుమెంటేషన్ ప్రాక్టీస్’ (జీఎంపీ) ప్రాముఖ్యతపై అతిథ్య ఉపన్యాసం ఇచ్చారు. జీఎంపీ నాణ్యత హామీలో అంతర్భాగమైనదని, మంచి తయారీ అలవాట్లతో ముడిపడి ఉందన్నారు. పత్రాల తయారీ, సమీక్షించడం, ఆమోదించడం, జారీచేయడం, రికార్డింగ్, నిల్వ చేయడం వంటి క్రమబద్ధమైన ప్రక్రియలన్నీ ఉత్తమ డాక్యుమెంటేషన్ ప్రాక్టీస్లో భాగంగా ఆయన అభివర్ణించారు.
ఉత్తమ తయారీ పద్ధతుల యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, ఔషధాలను స్థిరంగా ఉత్పత్తి చేయడంతో పాటు వినియోగానికి తగిన నాణ్యతా ప్రమాణాలతో, ఉత్పత్తి మార్గదర్శకాలకు అనుగుణంగా నియంత్రిస్తాయని డాక్టర్ సత్యేంద్రనాథ్ చెప్పారు. ఔషధాల తయారీలో నాణ్యత నిర్వహణ, సిబ్బంది అర్హత, పరిశుభ్రత, డాక్యుమెంటేషన్, రికార్డులు, పదార్థాల నిర్వహణ, ఉత్పత్తి, ప్యాకేజింగ్ వంటి అంశాల ప్రాధాన్యాన్ని కూడా ఆయన వివరించారు.గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీ.ఎస్.కుమార్ అతిథిని స్వాగతించి సత్కరించగా, కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ హెన్డు పొన్నగంటి వందన సమర్పణ చేశారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…