బీజేపీలో చేరుతున్నట్లు నాపై దుష్ప్రచారం…
– టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్
– యూట్యూబ్ చానళ్లలో తప్పుడు వార్తలు
– పరువునష్టం దావా వేస్తానని హెచ్చరిక
హైదరాబాద్:
టీఆర్ఎస్ జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ త్వరలోనే బీజేపీలో చేరుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై బీబీ పాటిల్ స్వయంగా స్పందించారు. తాను టీఆర్ఎస్ ను వీడుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజంలేదని స్పష్టం చేశారు. తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కొన్ని సోషల్ మీడియా వేదికలు, యూట్యూబ్ చానళ్లు తమ పబ్బం గడుపుకోవడానికి అసత్య ప్రచారం చేస్తున్నాయని, ఆ వార్తల్లో నిజం ఎంతమాత్రం లేదని తెలిపారు.తప్పుడు ప్రచారాలు చేరుకోవాలని కోరారు .
తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న యూట్యూబ్ చానళ్లు, సోషల్ మీడియాలో అసత్య పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకుంటానని బీబీ పాటిల్ హెచ్చరించారు. త్వరలోనే పరువునష్టం దావా వేస్తానని చెప్పారు. తాను చివరి వరకు టీఆర్ఎస్ లోనే కొనసాగుతానని ఉద్ఘాటించారు. తాను ప్రజలతో మమేకమై చేస్తున్న మంచి పనులను చూసి ఓర్వలేక కొందరు ఇలాంటి చిల్లరవేషాలు వేస్తున్నారని పాటిల్ విమర్శించారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…