Telangana

సౌత్ జోన్ స్టేట్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో  సత్తా చాటిన పటాన్‌చెరు యువకుడు బచ్చు హేమంత్ ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

పటాన్‌చెరు పారిశ్రామిక వాడకు చెందిన యువ బాక్సర్ బచ్చు హేమంత్ ముదిరాజ్ బాక్సింగ్‌లో అద్భుత ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకాన్ని సాధించాడు. సెప్టెంబర్ 5న సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన సౌత్ జోన్ స్టేట్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో 50–55 కిలోల బరువు విభాగంలో బచ్చు హేమంత్ ముదిరాజ్ అద్భుత ప్రదర్శనతో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు.ఈ విజయంతో బచ్చు హేమంత్ ముదిరాజ్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.సెప్టెంబర్ 17 నుంచి 19వ తేదీ వరకు బెంగళూరులోని కోరమంగళ ఇండోర్ స్టేడియంలో జరగనున్న నేషనల్ సౌత్ జోన్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించనున్నాడు.హేమంత్ ముదిరాజ్ ఈ విజయానికి ఆయన కోచ్ గిరి బాబు అందించిన శిక్షణ, మార్గదర్శకత్వం ఎంతో దోహదపడింది. కోచ్ గిరి బాబు ఆధ్వర్యంలో కఠోర శిక్షణ పొందుతూ హేమంత్ ఈ స్థాయికి చేరుకున్నాడు.బచ్చు హేమంత్ ముదిరాజ్ స్వర్ణ పతకం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల కుటుంబ సభ్యులు, పారిశ్రామిక వాడ ప్రజలు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయి పోటీల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి తెలంగాణ రాష్ట్రానికి, పటాన్‌చెరుకు మరింత పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని ఈ సందర్భంగా పలువురు ఆకాంక్షించారు.

admin

Recent Posts

రుద్రారం శ్రీ గణేష్ దేవస్థానంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన కాట శ్రీనివాస్ గౌడ్ దంపతులు మనవార్తలు ప్రతినిధి ,పటాన్…

19 minutes ago

పర్యావరణ శాస్త్రంలో కెజియా ఎలిజబెత్ కు పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, పర్యావరణ శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఎం.…

6 hours ago

సేవా కార్యక్రమాలతో జీఎంఆర్ జన్మదిన వేడుకలు

-పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు…

18 hours ago

రామచంద్రాపురంలో ఘనంగా ఎమ్మెల్యే జిఎంఆర్ జన్మదిన వేడుకలు

-ఐలేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం…

18 hours ago

పూరి బీచ్‌పై మెరిసిన ఎమ్మెల్యే జిఎంఆర్ సైకత శిల్పం

ఎమ్మెల్యే జన్మదినానికి అభిమానుల వినూత్న కానుక అభిమానానికి ప్రతి రూపంగా ప్రత్యేక బహుమతి అందించిన బిఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు…

19 hours ago

వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించాలి శ్రీ యలమంచి ఉదయ్ కిరణ్

మనవార్తలు ప్రతినిధి ,మియాపూర్: మియాపూర్ మక్త మహబూబ్‌పేట్ డివిజన్ పరిధిలోని ప్రజయ్ షెల్టర్స్, ఎస్‌ఆర్ ఎస్టేట్స్, నైలా గేటెడ్ కమ్యూనిటీ,…

19 hours ago