మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:
ఆదివారం ఎర్రవల్లిలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రివర్యులు శ్రీ కేసీఆర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన భారత రాష్ట్ర సమితి లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో హ్యాట్రిక్ ఎమ్మెల్యే, పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ కేసీఆర్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పటాన్‌చెరు నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న పార్టీ కార్యక్రమాలను ఆయనకు వివరించారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో పటాన్‌చెరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అభివృద్ధికి ప్రతీకగా తీర్చిదిద్దామని తెలిపారు. గత రెండున్నర సంవత్సరాల కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం మూలంగా అభివృద్ధి కుంటుపడిందని ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకుని వచ్చిన 22A నిషేధిత జాబితా మూలంగా పటాన్‌చెరు నియోజకవర్గంలో 50 వేలకు పైగా ఎకరాల భూములు నిషేధిత జాబితాలో చేర్చారని ఈ అంశాన్ని అసెంబ్లీలో చర్చించి ప్రజలకు న్యాయం చేయాలని ఆయన కేసీఆర్ కి విన్నవించారు. కేసీఆర్ నాయకత్వంలో తిరిగి రాష్ట్రంలో అధికారం చేపట్టడం ఖాయమని ఎమ్మెల్యే జిఎంఆర్ ధీమా వ్యక్తం చేశారు .
విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన కాట శ్రీనివాస్ గౌడ్ దంపతులు మనవార్తలు ప్రతినిధి ,పటాన్…
మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, పర్యావరణ శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఎం.…
-పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు…
-ఐలేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం…
ఎమ్మెల్యే జన్మదినానికి అభిమానుల వినూత్న కానుక అభిమానానికి ప్రతి రూపంగా ప్రత్యేక బహుమతి అందించిన బిఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు…
మనవార్తలు ప్రతినిధి ,మియాపూర్: మియాపూర్ మక్త మహబూబ్‌పేట్ డివిజన్ పరిధిలోని ప్రజయ్ షెల్టర్స్, ఎస్‌ఆర్ ఎస్టేట్స్, నైలా గేటెడ్ కమ్యూనిటీ,…