ఇది ప్రజా పాలన కాదు.. వెయ్యి రోజుల పీడ పాలన
రేవంత్ రెడ్డి రాక్షస పాలనకు త్వరలోనే చరమగీతం
ప్రజల పక్షాన బీఆర్ఎస్ నిరంతర పోరాటం
పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:
పోరాడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధికి ప్రతీకగా నిలిచిందని.. గత రెండున్నర సంవత్సరాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో వెనక్కి నెట్టిందని విమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వ 420 మోసపూరిత హామీలు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బిఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపడుతున్న పోరుబాట కార్యక్రమంలో భాగంగా ఆదివారం బిహెచ్ఈఎల్ చౌరస్తా నుంచి ఇస్నాపూర్ వరకు భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఇస్నాపూర్ మున్సిపల్ కేంద్రంలో మహిళలతో కలిసి భారీ నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు.
రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, కార్మికులు, పేదలు ఇలా అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వ విధానాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.కేసీఆర్ హయాంలో సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లుగా పాలన సాగిందని, పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు తెలంగాణను దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దారని అన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం గతంలో అమలైన అనేక సంక్షేమ పథకాలను నిలిపివేసిందని ఆరోపించారు.ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీఆర్ఎస్ నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేస్తోందని తెలిపారు. ప్రజల సమస్యలపై రాజీలేని పోరాటం కొనసాగిస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు.
రాబోయేది మన ప్రభుత్వమే ప్రతి సంక్షేమ పథకాన్ని తిరిగి అమలుపరుస్తాం. ప్రజల సంక్షేమం, తెలంగాణ అభివృద్ధే బీఆర్ఎస్ లక్ష్యం” అని అన్నారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు తగిన సమయంలో గుణపాఠం చెబుతారని, ప్రజా వ్యతిరేక పాలనకు త్వరలోనే చరమగీతం పాడటం ఖాయమని గూడెం మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, గూడెం మధుసూదన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సుమలత శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్లు సపానా దేవ్, మెట్టు కుమార్ యాదవ్, అంజయ్య, మాజీ ఎంపీపీలు యాదగిరి యాదవ్, శ్రీశైలం యాదవ్, మాజీ జెడ్పిటిసిలు శ్రీకాంత్ గౌడ్, బాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్, మాజీ ఎంపీపీ గాయత్రి పాండు, ఉపేందర్, మేరాజ్ ఖాన్, పృథ్వీరాజ్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు, ఆటో కార్మికులు, మహిళలు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన కాట శ్రీనివాస్ గౌడ్ దంపతులు మనవార్తలు ప్రతినిధి ,పటాన్…
మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, పర్యావరణ శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఎం.…
-పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు…
-ఐలేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం…
ఎమ్మెల్యే జన్మదినానికి అభిమానుల వినూత్న కానుక అభిమానానికి ప్రతి రూపంగా ప్రత్యేక బహుమతి అందించిన బిఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు…
మనవార్తలు ప్రతినిధి ,మియాపూర్: మియాపూర్ మక్త మహబూబ్‌పేట్ డివిజన్ పరిధిలోని ప్రజయ్ షెల్టర్స్, ఎస్‌ఆర్ ఎస్టేట్స్, నైలా గేటెడ్ కమ్యూనిటీ,…