politics

గీతంలో బీటెక్ తో పాటు మైనర్ డిగ్రీ

2025-26 విద్యా సంవత్సరం నుంచి ఆరంభం

వెల్లడించిన డీన్&డైరెక్టర్ ప్రొఫెసర్ వీ.ఆర్.శాస్త్రి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరం నుంచి కోర్ బి.టెక్ తో పాటు మైనర్ డిగ్రీలను ప్రారంభించనున్నట్టు గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్, కోర్ ఇంజనీరింగ్ డీన్ ప్రొఫెసర్ రామశాస్త్రి వేదాల వెల్లడించారు. తొలి ఏడాది బి.టెక్ విద్యార్థులతో శనివారం ఆయన ముఖాముఖి నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రొఫెసర్ శాస్త్రి మాట్లాడుతూ, తాము చేస్తున్న ఈ ప్రయత్నం విద్యార్థులను బహుళ విభాగ నైపుణ్యంతో పాటు మెరుగైన కెరీర్ అవకాశాలను పొందడానికి వీలుకల్పిస్తుందన్నారు. సాంకేతిక విద్య పరివర్తన శక్తిని నమ్ముతూ, ఈ చొరవ ద్వారా ఆవిష్కరణలను నడిపించడం, ప్రపంచ సవాళ్లను పరిష్కరించడం, సృజనాత్మకతను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆయన చెప్పారు. ఈ మైనర్ డిగ్రీలు కోర్ ఇంజనీరింగ్ విభాగాలను పూర్తి చేయడానికి, విద్యార్థులకు వారి విద్యా, వృత్తిపరమైన పరిధులను విస్తృతం చేసే అదనపు నైపుణ్యాలను అందించడానికి రూపొందించినట్టు ప్రొఫెసర్ శాస్త్రి స్పష్టీకరించారు.

మైనర్ డిగ్రీలను ఎంచుకునే విద్యార్థులు ప్రామాణిక 160-క్రెడిట్ పాఠ్యాంశాల పైన అదనంగా 20 క్రెడిట్లను పూర్తి చేయాలని డీన్ నొక్కి చెప్పారు. మైనర్ డిగ్రీలను ఎంచుకున్న వారు మూడు – ఏడు సెమిస్టర్ల మధ్య ఐదు అదనపు సబ్జెక్టులను (ఒక్కొక్కటి నాలుగు క్రెడిట్లు) అభ్యసించాలని, విద్యార్థులు రోజుకు ఒక గంట అదనంగా కేటాయించాల్సి ఉంటుందన్నారు.మేజర్, మైనర్ డిగ్రీ రెండింటిలోనూ పట్టభద్రులైన విద్యార్థులు ఉన్నత విద్య అడ్మిషన్లు, క్యాంపస్ రిక్రూట్ మెంట్లలో ప్రత్యేక ఆధిక్యాన్ని కలిగి ఉంటారని ప్రొఫెసర్ శాస్త్రి స్పష్టీకరించారు. మైనర్ డిగ్రీ ఎనిమిది ప్రత్యేక విభాగాలలో అందుబాటులో ఉంటుందని, అవి ఏరోస్పేస్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, రోబోటక్స్ అండ్ ఏఐ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈసీఈ), ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (ఈఈఈ), ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ). ప్రతి విభాగం క్రాస్-డిసిప్లినరీ జ్జానం, నైపుణ్యాలను పెంపొందించడానికి ప్రాథమిక కోర్సులను అందిస్తుందని చెప్పారు.

మైనర్ డిగ్రీని అభ్యసించడం విద్యార్థి సీజీపీఏ లేదా విద్యా స్థితిని ప్రభావితం చేయదని ఓ ప్రశ్నకు డాక్టర్ శాస్త్రి బదులిచ్చారు. ఎందుకంటే, ఇది బహుముఖ ప్రజ్జ, కెరీర్ సంసిద్ధతను పెంపొందించే లక్ష్యంతో రూపొందించిన ఒక ఐచ్ఛిక (ఆప్షనల్) కార్యక్రమని ఆయన స్పష్టీకరించారు.తొలుత, బీటెక్ తొలి ఏడాది సమన్వయకర్త ప్రొఫెసర్ పి.త్రినాథరావు డీన్ అండ్ డైరెక్టర్ ప్రొఫెసర్ శాస్త్రిని స్వాగతించడంతో ఈ అవగాహనా కార్యక్రమం ఆరంభమైంది. అక్రిడిటేషన్, ఐక్యూఈఎస్ డిప్యూటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కె.మంజునాథాచారి, ఇతర అధ్యాపకులు, తొలి ఏడాది బీటెక్ విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.డైనమిక్ గ్లోబల్ వర్క్ ఫోర్స్ డిమాండ్లను తీర్చడానికి సిద్ధంగా ఉన్న మంచి ఇంజనీర్లుగా అభివృద్ధి చెందడానికి విద్యార్థులకు అవకాశాలను అందించడం ద్వారా గీతం విద్యానైపుణ్యం, ఆవిష్కరణలకు తన నిబద్ధతను కొనసాగిస్తోంది.

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

6 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

2 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago