Telangana

ఆహారోత్పత్తుల రంగంలో రూ.16వేల కోట్ల పెట్టుబడులు : శ్రీధర్‌బాబు

– ఫుడ్‌ ఎ‘ఫెయిర్‌’ 2వ ఎడిషన్‌ పోస్టర్‌ ఆవిష్కరించిన మంత్రి

– జూన్‌ 12 నుంచి 3 రోజుల సందడి.. దేశంలోని ఆహార ఉత్పత్తిదారులు,, టాప్‌ చెఫ్స్‌ నగరానికి…

మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : 

బ్లిట్జ్‌ ఎగ్జిబిషన్ ఆధ్వర్యంలో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం, హైటెక్స్‌ ఎగ్జిబిషన్ సహకారంతో, తెలంగాణ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ ప్రధాన భాగస్వామిగా ఫుడ్‌ ఎ ఫెయిర్‌ 2వ ఎడిషన్‌ నిర్వహించనున్నారు. హైదరాబాద్ లోని హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో జూన్‌ 12 నుంచి 14, వరకు –3 రోజుల పాటు జరుగనున్న ఈ అతిపెద్ద, ఫుడ్‌ ఎఫెయిర్‌ ( ట్రేడ్‌ ఫెయిర్‌) ఫోస్టర్ ను రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు శనివారం నాడు ఉదయం బ్లిట్జ్‌ ఎగ్జిబిషన్స్ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీకాంత్‌ పునాటి, తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ (TFPS) డైరెక్టర్ అఖిల్, డెరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ డాక్టర్ జి. మల్సుర్, హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ సిఓఓ శ్రీకాంత్, మిల్లెట్ బ్యాంక్ CEO విశాల రెడ్డి తదితరులతో కలసి హైటెక్స్ హాల్ లో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ తెలంగాణ ఆహార, వ్యవసాయ ప్రాసెసింగ్ రంగం వృద్ధి పధంలో వేగంగా అడుగులు వేస్తోందని ఈ ఆహారోత్పత్తుల రంగంలో రూ.15,919 కోట్ల (సుమారు రూ16,000 కోట్లు) పెట్టుబడులు ప్రస్తుతం వివిధ దశల్లో అమలులో ఉన్నాయన్నారు. అలాగే 7,150 ఎకరాల విస్తీర్ణంలో 14 ప్రత్యేక ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్ లను తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిందనీ, పారిశ్రామికవేత్తలకు అత్యుత్తమ సాంకేతికత, ప్రపంచ శిక్షణ, పరిజ్ఞానం, విస్త్రుత మార్కెట్‌ను పొందడంలో సహాయ సహకారాలు అందించడానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఇన్నోవేషన్, ఇన్వెస్ట్‌మెంట్‌ ఇన్ క్లూజి విటీ మేళవింపుతో అభివృద్ధికి ఊతమిచ్చే వాతావరణాన్ని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ‘ఆహారం– వ్యవసాయ–ప్రాసెసింగ్‌ రంగంలో తెలంగాణను జాతీయ అగ్రగామిగా నిలబెట్టడానికి తమ ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోందని ఉధ్ఘాటించారు.

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సాధికారత కు ‘‘ప్లగ్‌–అండ్‌–ప్లే’’ తరహా మౌలిక సదుపాయాలు, ఆర్థిక ప్రోత్సాహకాలతో పాటు అనేక రకాలుగా చేయూతని అందిస్తోందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పారిశ్రామికవేత్తల కోసం పటిష్టమైన అనుకూల వ్యవస్థను పెంపొందించడంలో ప్రభుత్వం తిరుగులేని నిబద్ధతను కనపరుస్తోందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆహార ఉత్పత్తిదారులు, ఫుడ్ ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ రంగం, చెఫ్‌లతో పాటు ఈ రంగంలోని ఔత్సాహికులకు ఫుడ్‌ ఎఫెయిర్‌ ఒక ప్రీమియర్ వేదికగా సేవలందించనుందని బ్లిట్జ్‌ నిర్వహకులు శ్రీకాంత్‌ పునాటి తెలిపారు.

ఒకచోట తమ ఆలోచనలు పంచుకోవడానికి, తమ తాజా ఆవిష్కరణలను ప్రదర్శించేందుకు ప్రధాన వేదికగా ఈ ట్రెడ్ ఫెయిర్ ఉపయోగపడుతుందనీ, వందలాది ఎగ్జిబిటర్లతో పాటు, ఇంటరాక్టివ్ వర్క్‌షాప్‌లు, పరిశ్రమ నిపుణుల సార ధ్యంలో ఇంటరాక్టివ్‌ వర్క్‌షాప్‌లు, ప్యానెల్‌ చర్చలు జరుగుతాయని శ్రీకాంత్‌ పునాటి వివరించారు. ఆహార ప్రియులతో పాటు పరిశ్రమ నిపుణులు , ఆహార రంగపు విశేషాలను అన్వేషించే ఆసక్తి ఉన్న ప్రతీ ఒక్కరికీ ఎగ్జిబిషకు ప్రవేశం ఉచితమని, మరింత సమాచారం కోసం +91 70757 71337ను సంప్రదించవచ్చని నిర్వహకులు తెలిపారు

admin

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

12 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago