politics

అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

రామేశ్వరంబండ గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ

అతి త్వరలో సొంత నిధులతో అంబేద్కర్ భవన నిర్మాణం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు, ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కంకణబద్దులు కావాలని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్‌చెరు మండలం రామేశ్వరంబండ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ అంతిరెడ్డి సొంత నిధులతో ఏర్పాటు చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే జిఎంఆర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన జీవితాన్ని బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి గొప్ప నాయకుడు డాక్టర్ అంబేద్కర్ అని తెలిపారు. కార్మికులకు కనీస వేతనాలు, సమాన హక్కులు, పరిపాలన వికేంద్రీకరణ, చిన్న రాష్ట్రాలు, పరిపాలనలో మహిళలకు 50% రిజర్వేషన్లు, తదితర మహోన్నత నిర్ణయాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారానే తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఆయన స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు అందించాలన్న లక్ష్యంతో నియోజకవర్గ వ్యాప్తంగా ఆయన విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు  20 లక్షల రూపాయల సొంత నిధులచే అంబేద్కర్ భవనం నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన చేస్తామని హామీ ఇచ్చారు.ఇటీవల తాను లండన్ వెళ్లినప్పుడు అంబేద్కర్ విద్యను అభ్యసించిన కళాశాలను సందర్శించడం జరిగిందని తెలిపారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు పాటు పడాలని కోరారు. యువత అంబేద్కర్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ ధరణి అంతి రెడ్డి, సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, ఆంజనేయులు, నగేష్, శంకర్, సురేష్, ఇబ్రహీం, అర్జున్, కిరణ్, రమేష్, దానయ్య, నవీన్, సర్దార్, సాయిలు, రాములు, లోకేష్, దశరథ్, యాదమ్మ, నగేష్, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago