అందుబాటులోకి రానున్న గ్యాస్, డీజిల్ స్మశాన వాటిక…
– ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు:
90 లక్షల రూపాయల జిహెచ్ఎంసి నిధులతో పటాన్ చెరు పట్టణ శివారులోనీ చిన్న వాగు సమీపంలో నిర్మించిన గ్యాస్, డీజిల్ స్మశాన వాటికలో పనులు పూర్తయ్యాయని, అతి త్వరలో ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.
శనివారం సాయంత్రం జిహెచ్ఎంసి అధికారులతో కలిసి స్మశాన వాటికను ఆయన పరిశీలించారు. స్మశాన వాటిక ప్రాంగణంలో మౌలిక వసతులు సైతం పూర్తి చేసినట్లు తెలిపారు. పూర్తి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్మశాన వాటిక ను నిర్మించినట్లు తెలిపారు.
నియోజకవర్గంలోనే మొట్టమొదటిసారిగా గ్యాస్, డీజిల్ ఆధారిత స్మశాన వాటికను పటాన్ చెరు లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిరుపేదలకు సైతం అందుబాటులో ఉండేలా రుసుములు నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: సనాతన ధర్మాన్ని యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని పటాన్ చిరు…
స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా విజయవాడలో ఘన సన్మానం మనవార్తలు ,విజయవాడ: స్వామి వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకుని…
దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడాయన ఆయన స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి నీలం మధు ముదిరాజ్ చిట్కుల్ లో…
జాతీయ స్థాయి అండర్ 14 కబడ్డీ పోటీలలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన తెలంగాణ జట్టు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:…
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి విన్నవించిన పాటి గ్రామస్తులు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ముత్తంగి డివిజన్ పాటి గ్రామ…
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…