భారత్‌లోనే అరుదైన రోబోటిక్ స్కార్లెస్ థైరాయిడ్ సర్జరీ విజయవంతం
మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :
భారతదేశం అడ్వాన్స్‌డ్ సర్జరీలలో ప్రపంచ స్థాయి కేంద్రంగా మారుతోందని నిరూపిస్తూ, మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఒక గొప్ప విజయాన్ని సాధించిందనీ మెడికవర్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. సీనియర్ రోబోటిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్, క్యాన్సర్ సర్జన్ డాక్టర్ అజయ్ వరుణ్ రెడ్డి ఆధ్వర్యంలో మొదటి రోబోటిక్ స్కార్లెస్ థైరాయిడెక్టమీ ఆపరేషన్ విజయవంతంగా జరిగిందనీ తెలిపారు.ఇది మెడికవర్ గ్రూప్ చరిత్రలోనే భారతదేశంలో అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా మొదటిసారి అని అన్నారు.ఈ రోబోటిక్ స్కార్లెస్ థైరాయిడ్ ఆపరేషన్ చాలా అరుదుగా జరుగుతుందనీ, భారతదేశంలో కేవలం నాలుగైదు ఆసుపత్రులకు మాత్రమే దీనికి కావాల్సిన అధునాతన టెక్నాలజీ, నిపుణులైన సర్జన్లు ఉన్నారనీ, ఇప్పుడు, మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ కూడా ఆ అరుదైన గ్రూపులో చేరిందన్నారు. ఇక్కడ సాధారణ థైరాయిడ్ ఆపరేషన్‌కి బదులుగా, మెడ మీద మచ్చ లేకుండా అత్యాధునిక శస్త్రచికిత్స అందిస్తారనీ తెలిపారు. రాబిట్ పద్ధతి థైరాయిడ్ ఆపరేషన్‌లో ఒక కొత్త పద్ధతి. ఇందులో మెడ మీద కోత పెట్టకుండా, చేతి కింద మరియు ఛాతీ పైభాగంలో దాచి ఉంచే చిన్న కోత ద్వారా థైరాయిడ్ గ్రంథిని చేరుకుంటారు. ఈ రోబోటిక్ పద్ధతి వల్ల కోలుకోవడం వేగంగా జరుగుతుంది, నొప్పి తక్కువగా ఉంటుందనీ ముఖ్యంగా మెడ మీద ఎలాంటి మచ్చ కనిపించదు. ఇది యువకులకు, ఉద్యోగులకు, అందాన్ని కోరుకునే వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఈ ఆపరేషన్ కోసం తమ దేశాల్లో ఈ సదుపాయం లేని సుడన్ దేశానికి చెందిన 50 సంవత్సరాల శర్ఫీఫ్ అబ్దుల్లా మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌కు వచ్చారు. వారికి కూడా రాబిట్ పద్ధతిలో ఆపరేషన్ చేశారు. 48 గంటల్లోనే వాళ్ళను డిశ్చార్జ్ చేశారు. ఆపరేషన్ జరిగినట్లు ఎక్కడా ఎలాంటి గుర్తు లేదనీ, దీనితో అధునాతన క్యాన్సర్ చికిత్సకు, రోగులకు స్నేహపూర్వకమైన వైద్యానికి భారతదేశం ఒక మంచి గమ్యస్థానంగా మారుతోందని రుజువవుతుందనీ తెలిపారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…