10 కోట్ల 78 లక్షల రూపాయలతో పటాన్‌చెరు తిమ్మక్క చెరువు,
ముత్తంగి ఎంక చెరువుల అభివృద్ధి,సుందరీకరణ పనులకు శంకుస్థాపన
పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని తిమ్మక్క చెరువు, తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ముత్తంగి గ్రామ పరిధిలోని ఎంక చెరువులను హెచ్ఎండిఏ ద్వారా 10 కోట్ల 78 కోట్ల లక్షల రూపాయలతో పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నామని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఉదయం స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి రెండు చెరువుల వద్ద సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్చెరు, ముత్తంగి పరిధిలో ప్రజలకు ఆహ్లాద కేంద్రాలుగా ఉండేందుకు చెరువులను సుందరీకరణ చేపడుతున్నామని తెలిపారు. ప్రతి చెరువు కట్ట పైన సెంట్రల్ లైటింగ్ సిస్టం, గ్రీనరీ, వాకింగ్ ట్రాక్, పిల్లలు ఆడుకునేందుకు పార్క్, తదితర సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అతి త్వరలో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. నిధులు సరిపోని పక్షంలో సి ఎస్ ఆర్ ద్వారా మరిన్ని నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, హెచ్ఎండిఏ చెరువుల విభాగం డి ఈ రామకృష్ణ, ముత్తంగి మాజీ సర్పంచ్ ఉపేందర్, తెల్లాపూర్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు గౌడ్, కాంగ్రెస్ పార్టీ పటాన్చెరువు పట్టణ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి, దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, కుమార్ గౌడ్, సిల్వేరి శ్రీనివాస్, మేరాజ్ ఖాన్, కిట్టు, రామకృష్ణ, యాదయ్య, ప్రభాకర్ గుప్తా, అశోక్, శ్రీనివాస్ రెడ్డి, అంజాద్,
భక్తుల సౌకర్యార్థం సొంత నిధులతో రోడ్డు నిర్మాణం ఐదు లక్షల రూపాయలు అందజేత విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు…
విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన కాట శ్రీనివాస్ గౌడ్ దంపతులు మనవార్తలు ప్రతినిధి ,పటాన్…
మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, పర్యావరణ శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఎం.…
-పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్చెరు…
-ఐలేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం…
ఎమ్మెల్యే జన్మదినానికి అభిమానుల వినూత్న కానుక అభిమానానికి ప్రతి రూపంగా ప్రత్యేక బహుమతి అందించిన బిఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు…