Hyderabad

కన్నుల పండుగగా గీతం పన్నెండో స్నాతకోత్సవం

పటాన్ చెరు:

– గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ సీఎండీకి గౌరవ డాక్టరేట్

– 1300 పైగా విద్యార్థులకు పట్టాల ప్రదానం • అత్యుత్తమ ప్రతిభ చాటిన
-13 మందికి బంగారు పతకాలు

హైదరాబాద్ , పటాన్ చెరు సమీపంలో నెలకొని ఉన్న గీతం డీమ్ విశ్వవిద్యాలయంలో శనివారం 12 వ స్నాతకోత్సవం కన్నుల పండుగగా జరిగింది . గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కృష్ణ ప్రసాద్ చిగురుపాటికి గౌరవ డాక్టర్ ఆఫ్ సైన్స్ ( డీఎస్సీ ) ని ప్రదానం చేశారు . కట్టుదిట్టంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో 2020-21 విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్ , మేనేజ్ మెంట్ , సైన్స్ , ఫార్మశీ , హ్యుమానిటీస్ కోర్సులు పూర్తిచేసిన దాదాపు 1300 మంది పట్టభద్రులకు డిగ్రీలను , 13 మంది టాపర్లకు బంగారు పతకాలను అందజేశారు .

బీటెక్ అన్ని విభాగాలలో అత్యుత్తమ ర్యాంకుతో పాటు సీఎస్ఈ విభాగంలో ప్రథమ ర్యాంకు సాధించిన అరవపల్లి ఈలో పోచిరాజు సాయి మౌనిక , బీఎస్సీ ( హానర్స్ ) కెమిస్ట్రీలో మందుమూల స్వర్ణ , బీఎస్సీ గణితంలో శృతి మానసి వావిలకొలను , బీఎస్సీ ఫిజిక్స్ లో క్షితిజ్ అజిత్ అథవాలే , ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీలో పోరండ్ల పవన్ , బీకాం ( హానర్స్ ) లో కేదాస్ అనురాగ్ , బీబీఏ ( మేనేజ్ మెంట్ అకౌంటింగ్ ) లో చింతలపూడి శ్రావణి , బీబీఏలో సౌజన్య వల్లభనేని , బీబీఏ ( ఫైనాన్షియల్ మార్కెట్స్ ) లో సూరె శ్రావణి , బీబీఏ ( బిజినెస్ అనెలిటిక్స్ ) లో డీఆర్ గీతాంజలి , ఎంబీఏలో ఎల్.తేజస్విని రావులు గీతం వ్యవస్థాపకుడు డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తి పేరిట నెలకొల్పిన ప్రెసిడెంట్ బంగారు పతకాలను పొందారు .

బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ లో ప్రథమ ర్యాంకు సాధించిన పూర్ణిను సిగ్గానికి వేగా కన్వేయర్స్ అండ్ ఆటోమేషన్ సౌజన్యంతో నెలకొల్పిన టాపర్స్ బంగారు పతకాన్ని ప్రదానం చేశారు . పచ్చటి ప్రకృతి మధ్య నెలకొని ఉన్న గీతం ప్రాంగణం పట్టాలను అందుకోవడానికి వచ్చిన విద్యార్థులు , వారి తల్లిదండ్రులతో కళకళలాడింది . ప్రయోజకులవుతున్న పిల్లలను చూసుకుంటూ తల్లిదండ్రులు మురిసిపోగా , పట్టాలు అందుకున్న విద్యార్థుల హిప్ హిప్ హుర్రే నినాదాలతో ప్రాంగణం మార్మోగింది . దీర్ఘ విరామం తరువాత కలిసిన మిత్రులను హృదయానికి హత్తుకోవడం వంటి దృశ్యాలు ఆకట్టుకున్నాయి .

పట్టభద్రులంతా ధవళ వస్త్రధారణ , ఎర్రని కండువాలతో వచ్చి భారతీయను వ్యక్తపరిచారు . బంగారు పతక విజేతలు , పట్టభద్రులు పలువురు గీతమ్ తో తమకున్న అనుబంధం , అక్కడ ఎదిగిన తీరు , విద్యనభ్యసించేటప్పటి పలు అంశాలను నెమరువేసుకున్నారు . మొత్తంగా పండుగ వాతావరణంలో గీతం 12 వ స్నాతకోత్సవం విజయవంతంగా ముగిసింది . ఈ కార్యక్రమంలో గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ , కార్యదర్శి ఎం.భరద్వాజ , వీసీ ప్రొఫెసర్ కె.శివరామకృష్ణ , ప్రోఏసీలు ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , ప్రొఫెసర్ డి.సాంబశివరావు , రిజిస్ట్రార్ డి.గుణశేఖరన్ , రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ తదితరులు పాల్గొన్నారు .

Ramesh

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

9 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago