Hyderabad

74 ఏళ్ళ వయస్సులో పీహెచ్డీ…డాక్టర్ సుబ్బారావు తులసి

పటాన్ చెరు:

గీతం డీమ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ 12 వ స్నాతకోత్సవం ఓ అరుదైన రికార్డుకు వేదికైంది . డాక్టర్ సుబ్బారావు తులసి , తన 74 వ యేట మేనేజ్ మెంట్ లో పీహెచ్ డీ పట్టాను గీతం హైదరాబాద్ బిజినెస్ స్కూల్ నుంచి పొందారు . జీహెచ్ బీఎస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.సుమన్ బాబు మార్గదర్శనంలో నాయకత్వ శైలి , దాని ఫలితం ( ఐటీసీలోని మూడు విభాగాల పరిశీలన ) అనే అంశంపై ఆయన పీహెచ్డీని పూర్తిచేశారు . 1970 లో బీఈ ( మెకానికల్ ) పూర్తి చేశాక డాక్టర్ సుబ్బారావు రూర్కెలాలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో చేరి , అక్కడి బొకారో స్టీల్ ప్లాంలో 1983 వరకు పనిచేశారు .

తరువాత ఐటీసీ భద్రాచలం పేపర్ బోర్డ్స్ లిమిటెడ్ లో చేరారు . 2007 లో ఐటీసీలో హెల్తర్ విభాగం ఉపాధ్యక్షుడిగా పదవీ విరమణ చేశారు . ఆ తరువాత తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ ( తెలుగు ) , గీతంలో ఎంబీఏ ( ఫైనాన్స్ ) లను పూర్తిచేశారు . 2012-14 వరకు హైదరాబాద్ విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ లో , 2015-16 వరకు గీతంలో విజిటింగ్ ప్రొఫెసర్ గా సేవలందించి దాదాపు నలభై ఏళ్ళ అనుభవాన్ని గడించారు .

Ramesh

Recent Posts

సిగాచి ఇండస్ట్రీస్ ప్రమాద బాధితులకు పూర్తి న్యాయం చేయాలి కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డికి మెట్టు శ్రీధర్ విజ్ఞప్తి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: 2025 జూన్ 30న సంగారెడ్డి జిల్లా పాశమైలారం లోని సిగాచి ఇండస్ట్రీస్‌లో జరిగిన ఘోర…

8 hours ago

సిద్ధార్థ నగర్ కాలని సంక్షేమ సంఘం ఎన్నికలు

గౌరవ సలహాదారుగా చుక్కా రాములు గౌరవ అధ్యక్షులుగా పాండు రంగా రెడ్డి అధ్యక్షులుగా ఉపేందర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:…

8 hours ago

కాంగ్రెస్ ప్రభుత్వానికి కాలం చెల్లినట్లే.. పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి..

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ.. ప్రజలకు ఇచ్చిన అమలు…

8 hours ago

యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ఘన విజయం

మనవార్తలు ప్రతినిధి , మియాపూర్: సమాజ సేవే లక్ష్యంగా నిరంతరం ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న యలమంచి ఉదయ్…

1 day ago

బిఆర్ఎస్ లో చేరిన భానూరు కాంగ్రెస్ కీలక నాయకులు, వార్డు సభ్యురాలు..

గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రివర్యులు, బిఆర్ఎస్ పార్టీ శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శ్రీ తన్నీరు…

1 day ago

నిండు జీవితానికి రెండు చుక్కలు

పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: దేశ వ్యాప్త పల్స్…

1 day ago