Telangana

కాంగ్రెస్ ప్రభుత్వానికి కాలం చెల్లినట్లే.. పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి..

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ.. ప్రజలకు ఇచ్చిన అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి విమర్శించారు. ఆదివారం సాయంత్రం పటాన్‌చెరు మండలం భానూరు గ్రామంలో ఇటీవల బిఆర్ఎస్ పార్టీలో చేరిన గ్రామ పంచాయతీ వార్డ్ సభ్యులు ప్రవళిక నరేందర్ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీకి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరచితలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపాన్ని ప్రజలు గమనిస్తున్నారని.. అతి త్వరలో ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమని అన్నారు. ప్రభుత్వం సహకరించక పోయిన నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళ్తున్నామని తెలిపారు. కార్యకర్తలను గుండెల్లో పెట్టుకొని చూసుకుని ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని.. ప్రతి కార్యకర్త పార్టీ పటిష్టతకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి, శ్రీనివాస్, సాగర్, శివయ్య, నాగేష్, మధు, రవి, సత్తయ్య, మాణిక్యం, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago