Telangana

బిఆర్ఎస్ లో చేరిన భానూరు కాంగ్రెస్ కీలక నాయకులు, వార్డు సభ్యురాలు..

గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రివర్యులు,

బిఆర్ఎస్ పార్టీ శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శ్రీ తన్నీరు హరీష్ రావు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

తెలంగాణ తొలి ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి నాయకత్వంలో మాజీ మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారి నేతృత్వంలో బిఆర్ఎస్ పార్టీ విధానాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో బిఆర్ఎస్ లో చేరుతున్నారని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్‌చెరు మండలం భానూరు గ్రామానికి చెందిన గ్రామపంచాయతీ వార్డు సభ్యులు ప్రవళిక నరేందర్, యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సాగర్, యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి కుమ్మరి శివయ్య లు తమ అనుచరులతో కలిసి శనివారం సాయంత్రం హైదరాబాద్ లో మాజీ మంత్రివర్యులు హరీష్ రావు సమక్షంలో గులాబీ కండువ కప్పుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ పటాన్‌చెరు నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీకి అడ్డా అని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికిని అదే పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారంటే ఆ పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నియోజకవర్గ పరిధిలోని ఐదు మున్సిపాలిటీలను బిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుందని గుర్తు చేశారు.
ప్రజలందరూ తిరిగి కెసిఆర్ పరిపాలన రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని ఆయన తెలిపారు. వీరి రాకతో బానూరు గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ మరింత బలపడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, గూడెం మధుసూదన్ రెడ్డి, విజయ్ కుమార్, శ్రీధర్ చారి, శ్యాంసుందర్ రెడ్డి, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago